Breaking News

హీరోయిన్‌ ప్రియా ఆనంద్‌కు లక్కీ ఛాన్స్‌.. యమ ఖుషీలో నటి

Published on Thu, 02/02/2023 - 12:19

అనుకున్నది జరగకపోవడం, ఊహించనిది జరగడమే జీవితం. అందుకే అంటారు పెద్దలు ఏం జరిగినా అంతా మన మంచికే అని. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు హాట్‌ టాక్‌గా వరిన విషయం విజయ్‌ 67 చిత్రం. బీస్ట్‌ చిత్రం నిరాశపరినా, వారీసు చిత్రంతో నటుడు విజయ్‌ మళ్లీ విజయబాట పట్టారు. ప్రస్తుతం తన 67వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి మాస్టర్, విక్రమ్‌ చిత్రాల ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 7 స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌ఎస్‌.లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను నిర్మాతలు వినత్న పద్ధతిలో గంటకో నటుడి చొప్పున పరిచయం చేశారు.

ముందుగా నటుడు అర్జున్‌ పేరును, ఆ తరువాత దర్శకుడు గౌతమ్‌ మీనన్, మిష్కిన్, మ్యాత్యూ థామస్, మన్సూర్‌ అలీఖాన్, బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్, నృత్యదర్శకుడు శాండి, నటి ప్రియా ఆనంద్‌ తాజాగా బుధవారం త్రిష పేరును ప్రకటించారు. నటి త్రిష ఇంతకు ముందు విజయ్‌ సరసన మూడు చిత్రాల్లో నటించారు. సుమారు 14 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు నటిస్తున్నారు. ఇక నటి ప్రియాఅనంద్‌ విషయానికి వస్తే ఈ చిత్రంలో ఈ అమ్మడికి నటించే అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంకా చెప్పాలంటే ఇంత పెద్ద అవకాశం రావడం ఈమెకు ఇదే తొలిసారి అవుతుంది.

వామనన్‌ చిత్రం ద్వారా 2009లో కథానాయకిగా పరిచయం అయిన నటి ప్రియా ఆనంద్‌. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినా పెద్ద స్టార్స్‌తో ఇప్పటి వరకూ నటించలేదు. తాజాగా విజయ్‌తో జత కట్టే అవకాశం రావడంతో యమ ఖుషీ అయిపోతోందట. కారణం 11 ఏళ్ల క్రితం విజయ్‌ సరసన తుపాకీ చిత్రంలో ఈ బ్యూటీనే నటించాల్సి ఉందట.  ఆ చిత్ర దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ తొలి చాయిస్‌ కూడా ప్రియా ఆనంద్‌నే నట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం చేజారిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు విజయ్‌తో జత కట్టే అవకాశం రావడం చెప్పలేనంత ఆనందంగా ఉందంటోంది.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)