హీరో భార్య 'అనొద్దన్న సెలబ్రిటీ వైఫ్‌'.. మిగిలిన హీరోల భార్యలు..?

Published on Thu, 07/31/2025 - 21:23

ఓ పెద్ద నటుడు, మరీ ముఖ్యంగా అగ్ర హీరోల భార్యలుగా మారడం చాలా మందికి అదృష్టం కావచ్చు అయితే కొందరు మాత్రం కేవలం వారి భార్యలుగా దక్కిన అదృష్టంతో మాత్రమే మిగిలిపోవాలని కోరుకోవడం లేదు. తమను తాము నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించడంలో మన మాధ్యమాలు తరచుగా  విఫలమవుతుంటాయి. ఒక పురుషుడిని పెళ్లి చేసుకున్న తర్వాత వంటింటికి మాత్రమే పరిమితమైన గృహిణి ఆకాంక్షలు ఒకలా ఉంటే, పెళ్లి తర్వాత కూడా గడపదాటి తనను తాను నిరూపించుకుంటూ సాగిపోయే  వివాహిత ఆకాంక్షలు మరోలా ఉంటాయి అనేది నిర్వివాదం. ఏ వ్యక్తి అయినా తాను సాధించిన విజయాలకు, ప్రత్యేకతలకు తగ్గ వ్యక్తిగత గుర్తింపును ఆశించడం సహజం. దీనికి మగ, ఆడ వ్యత్యాసం లేదు. ఈ నేపధ్యంలో తాజాగా మళయాళ నటుడు ప్రస్తుతం టాప్‌ పొజిషన్‌లో ఉన్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ భార్య సుప్రియా మీనన్‌ తాజాగా ఇచ్చిన ఒక  సంచలనాత్మక ప్రకటన ప్రస్తావనార్హం.


ప్రసార మాధ్యమాలతో పాటు అనేక మంది తనను తరచుగా ప్రృధ్వీరాజ్‌ భార్యగా  పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు.  తాను కేవలం ఒక టాప్‌ హీరో, నటుడు, సినీ ప్రముఖుడు ‘పృథ్వీరాజ్‌ భార్య‘గా మాత్రమే పరిగణన పొందాలనే దానిని కోరుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు  తన స్వంత కెరీర్‌లో  ఒక విజయవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నానని ఆమె బహిరంగంగానే స్పష్టం చేశారు. ఆమె తనకంటూ స్వంత ఇమేజ్‌ సృష్టించుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. ఏ మగవాడికి సంబంధించి అయినా ‘అతని భార్య‘, ‘అతని తల్లి‘ లేదా ‘అతని కుమార్తె‘గా తగ్గిపోకూడదని ఆమె అంటున్నారు.

పూర్వ జర్నలిస్ట్, ప్రస్తుత చిత్ర నిర్మాత, పృధ్వీరాజ్‌ ప్రొడక్షన్స్‌కు సహ యజమాని అయిన సుప్రియా, ‘ఎల్‌2: ఎంపురాన్‌‘ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇవే కాక తన కంటూ స్వంత వృత్తిపరమైన విజయాలు ఉన్నప్పటికీ,  నిరంతరం తన భర్త పేరుతోనే గుర్తించబడటం అనేది తనపై ఎలాంటి  ప్రభావం చూపుతుందో ఆమె ధైర్యంగా  వెల్లడించడం హర్షణీయం.

ఇలా ఒక అగ్రహీరో భార్య బహిరంగంగా వ్యాఖ్యానించడం అనేది  నిజంగా ఒక గేమ్‌ ఛేంజర్‌ కావచ్చు. మహిళల స్వయం సాధికారత గురించి మాట్లాడే ఉపన్యాసాలు దంచే ఎందరో ప్రముఖులు వారి భార్యలు సాధిస్తున్న విజయాలను తమ సెలబ్రిటీ స్టేటస్‌ మాటున బలిచేస్తున్న పరిస్థితి ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంది. అదే సమయంలో పలువురు నటుల భార్యలు హీరోయిజం అనే షాడో మాటున తమని తాము కోల్పోకుండా వ్యక్తిగత విజయాల కోసం తపిస్తుండడం కనిపిస్తోంది. ఉదాహరణకు టాలీవుడ్‌ హీరో రామచరణ్‌ భార్య ఉపాసన, నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ... వంటివారు వ్యక్తిగతంగానూ ఎంతో  పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటున్నారు. జీవిత భాగస్వామికి మాత్రమే కాదు తమ కష్టాల ఫలితంగా అందుకున్న తమ వ్యక్తిగత విజయాలకూ గుర్తింపు కోరుకోవడం తప్పు కాదు.. అది.. మహిళ అయినా మగవారైనా..
 

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)