ఇండస్ట్రీని వదిలేసిన ప్రముఖ దర్శకుడు.. కారణం ఆ జబ్బు!?

Published on Mon, 10/30/2023 - 17:16

సినిమా అనేది వ్యసనం లాంటిది. ఒక్కసారి ఇండస్ట్రీలోకి వస్తే తిరిగి బయటకెళ్లాలి అనిపించదు. కొందరు డైరెక్టర్స్ అయితే కెరీర్ ఖతం అయిపోయినా సరే పిచ్చి సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు టార్చర్ చూపిస్తుంటారు. అలాంటిది బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా తీసిన ఓ దర్శకుడు మాత్రం ఇండస్ట్రీని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ కారణమేంటో తెలుసా?

(ఇదీ చదవండి: యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!)

తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం జనరేషన్‌కి ఈ భాషా చిత్రాలు పరిచయమైంది 'ప్రేమమ్'తోనే. సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా పరిచయమైన ఈ మలయాళ మూవీ.. 2015లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి దర్శకత్వం వహించిన అల్ఫోన్స్ పుత్రెన్‌కి బోలెడంత క్రేజ్ తీసుకొచ్చింది.

దర్శకుడు కావడానికి ముందు పలు షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ తీసిన అల్ఫోన్స్.. 2013లో 'నేరమ్' మూవీతో దర్శకుడిగా మారాడు. 'ప్రేమమ్'తో వేరే లెవల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత అవియల్ (2016), గోల్డ్ (2022), గిఫ్ట్ (2023) సినిమాలు తీశాడు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్)

కొన్నాళ్ల ముందు అల్ఫోన్స్ ఫొటోలు కొన్ని బయటకొచ్చాయి. వీటిలో బక్కచిక్కి పోయి, నెరిసిన గడ్డంతో కనిపించాడు. దీంతో అనారోగ్యానికి గురయ్యారా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఓ జబ్బుతో బాధపడుతున్నట్లు చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అందుకే దర్శకుడి కెరీర్‌కి పుల్‌స్టాప్ పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. 

'నా సినిమా థియేటర్ కెరీర్ ఆపేస్తున్నాను. అటిజం స్పెక్ర్టమ్ డిజార్డర్‌ సమస్యతో బాధపడుతున్నాను. నేను ఎవరికీ భారంగా ఉండలనుకోవట్లేదు. సాంగ్, వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ మాత్రం చేస్తాను. ఓటీటీ కంటెంట్ కూడా చేస్తాను. నిజానికి సినిమాలు ఆపేయాలనుకోవడం లేదు. కానీ వేరే అవకాశం లేకుండా పోయింది. చేయలేని వాటి గురించి ప్రామిస్ చేయలేను. అనారోగ్యం ఉన్నప్పుడు జీవితంలో ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్ ఇలా వస్తుంది' అని అల్ఫోన్ రాసుకొచ్చాడు. కానీ ఈ పోస్ట్ కాసేపటికే డిలీట్ చేశాడు.

(ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్)

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)