Breaking News

'ప్రేమలు' ఓటీటీ వివరాలు.. ఒకేసారి అన్ని భాషలలో రిలీజ్‌

Published on Thu, 03/14/2024 - 11:52

మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలైన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'ప్రేమలు'. ఓటీటీ వివరాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్‌లో వచ్చిన ఈ సినిమా రూ. 100 కోట్లు సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తెలుగులో కూడా ప్రేమలు అనే పేరుతో తాజాగా ఈ చిత్రం థియేటర్‌లోకి వచ్చింది. ఇక్కడ కూడా సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది.

ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ప్రేమలు యూత్‌కు బాగా కనెక్ట్‌ అయింది. ఈ హిట్‌ చిత్రానికి గిరీష్ ఏడీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నస్లేన్ కె.గఫూర్‌, మ‌మితా బైజు జంటగా నటించి మెప్పించారు. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోన్న ఈ మూవీ త్వ‌ర‌లో ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం.

ప్రేమ‌లు మూవీ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. మార్చి 29 నుంచి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌లలో ఒకేసారి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళంలో విడుదలై ఇప్పటికే 30రోజులు దాటింది. దీంతో ఈ సినిమాను మార్చి మొదటి వారంలోనే ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్ చేసింది.

కానీ ప్రేమ‌లు చిత్రం నచ్చి ఎస్‌.ఎస్‌.కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేశారు. దీంతో తెలుగు వెర్ష‌న్ మార్చి 8న థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. త‌మిళ వెర్ష‌న్ మార్చి 15న రిలీజ్ కానుంది. అందువ‌ల్లే ఓటీటీ రిలీజ్‌ కాస్త ఆలస్యం అయినట్లు చెబుతున్నారు. మార్చి 29 నుంచి హాట్‌స్టార్‌లో ప్రేమలు స్ట్రీమింగ్‌ కావడం దాదాపు ఖాయంగా కనిపస్తుంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)