Breaking News

అఫీషియల్: 'ప్రేమలు' సీక్వెల్.. రిలీజ్ కూడా చెప్పేశారు

Published on Fri, 04/19/2024 - 20:09

సంక్రాంతి తర్వాత అన్ని సినీ ఇండస్ట్రీల్లో డల్ ఫేజ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం, జనాల‍్ని మెప్పించే చిత్రాలు సరిగా రావట్లేదు. కానీ మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ చిత్రాలు వస్తున్నాయి. అన్ సీజన్ ఫిబ్రవరిలోనే ఏకంగా నాలుగు హిట్ సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటే 'ప్రేమలు'. మలయాళంతో పాటు తెలుగులోనూ యువతని ఆకట్టుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ చేశారు.

(ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!)

అవును మీరు విన్నది నిజమే. పెద్దగా కథ కాకరకాయ లాంటిది ఏం లేకపోయినా స్క్రీన్ ప్లేలో ఫన్ ఎలిమెంట్స్ జోడించడంతో 'ప్రేమలు'.. మలయాళంలో పెద్ద హిట్టయిపోయింది. తెలుగులోనూ రిలీజ్ చేస్తే రూ.17 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. సినిమాలో కథంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ కావడం ప్లస్ ట్రెండ్‌కి తగ్గ డైలాగ్స్ అన్నీ ఉండటం మనోళ్లకు నచ్చేసింది. అయితే కొందరు తెలుగు ఆడియెన్స్‌‌కి మాత్రం ఇది పెద్దగా నచ్చలేదు.

మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2025లో రిలీజ్ ఉంటుందని కూడా చెప్పేసింది. తొలి భాగంలా కాకుండా ఈసారి తెలుగు, తమిళ, మలయాళంలో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. పోస్టర్స్ తో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే తొలి భాగం.. హీరో పాత్రధారి యూకే వెళ్లడంతో ముగుస్తుంది. మరి సీక్వెల్ స్టోరీ యూకేలో ఉంటుందా? మళ్లీ హైదరాబాద్ లోనే ఉంటుందా అనేది చూాడాలి. అలానే ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కదా అని త్వరగా సీక్వెల్ తీసేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి?

(ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!)

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)