Breaking News

విజయకాంత్‌ అనారోగ్యంపై పుకార్లు.. ఖండించిన నటుడి సతీమణి

Published on Fri, 12/01/2023 - 10:47

తమిళ స్టార్‌, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయన మరణించాడంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానల్స్‌లో విజయకాంత్‌ ఇక లేరంటూ ఇష్టారీతిన ఫేక్‌ వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు.

కెప్టెన్‌ విజయకాంత్‌ సతీమణి ప్రేమలత సైతం సదరు వార్తలను ఖండించింది. కెప్టెన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని పేర్కొంది. ఆయన అనారోగ్యం గురించి వచ్చే వదంతులను నమ్మవద్దని కోరింది. అటు చెన్నైలోని ఆస్పత్రి వర్గాలు సైతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని బుధవారం నాటి ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.

ఇకపోతే విజయకాంత్‌ 'ఇనిక్కుం ఇలమై' సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించారు. 150కి పైగా సినిమాలు చేసిన ఆయన ఇరవైకి పైగా పోలీస్ స్టోరీల్లో నటించి అలరించారు. ఆయన నటించిన 100వ మూవీ 'కెప్టెన్ ప్రభాకర్' హిట్ అయిన తర్వాత నుంచి ఈయన్ని అందరూ కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. ఈయన చేసిన చాలా సినిమాలు తెలుగులోనూ డబ్, రీమేక్ అయ్యాయి. చిరంజీవి 'ఠాగూర్' మూవీ ఒరిజినల్ వెర్షన్ 'రమణ'లో విజయ్ కాంతే హీరోగా నటించారు!

చదవండి: ‘యానిమల్‌’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే.. ?

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)