Breaking News

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా

Published on Fri, 10/13/2023 - 16:58

ఓ రేంజులో హిట్ అయితే తప్పితే తెలుగు సినిమాలన్నీ దాదాపు నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని మాత్రం అందరూ మర్చిపోయిన తర్వాత స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా అలానే థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన చిత్రం... ఆల్మోస్ట్ రెండు నెలల తర్వాత ఓటీటీలో రిలీజైంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో రిలీజైంది?

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 29 సినిమాలు)

ఈ సినిమా సంగతేంటి?
తెలుగు యంగ్ హీరోల్లో సంతోశ్ శోభన్ ఒకడు. హిట్ కోసం చాన్నాళ్ల నుంచి కష్టపడుతున్నాడు. అలా ఆగస్టు 18న తను నటించిన 'ప్రేమ్ కుమార్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. పెళ్లి కూతురు లేచిపోతే పీటల మీద ఓ పెళ్లి కొడుకు మిగిలిపోతాడు. అలాంటి పెళ్లి కొడుకు కథే ఈ ప్రేమ్ కుమార్. అయితే కాన్సెప్ట్ పరంగా కొత్తగా ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం యావరేజ్ అనిపించుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి చూసేయొచ్చు.

ఏ ఓటీటీలో?
సంతోశ్ శోభన్, రుచిత సాధినేని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. శుక్రవారం(అక్టోబరు 13) నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయిపోయింది. ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏదైనా తెలుగు సినిమా చూద్దామని అనుకుంటే 'ప్రేమ్ కుమార్'ని ట్రై చేయొచ్చు. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)