Breaking News

రాహుల్‌ గాంధీపై కేసు? ప్రీతి జింటా ఏమందంటే?

Published on Fri, 02/28/2025 - 13:32

ఒకరు చేసిన పనికి మరొకర్ని నిందించడం సరికాదంటోంది హీరోయిన్‌ ప్రీతి జింటా (Preity Zinta). కేరళ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు తనపై ఆరోపణలు గుప్పించినందుకుగానూ రాహుల్‌గాంధీపై ప్రతీకారం తీర్చుకోవడం తనకిష్టం లేదని చెప్తోంది. తాజాగా ప్రీతి జింటా సోషల్‌ మీడియాలో చిట్‌చాట్‌ (ఆస్క్‌ మీ ఎనీథింగ్‌) నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది.

రాహుల్‌ తప్పు లేదు
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై కేసు పెడుతున్నావా? అని అడిగాడు. అందుకు ప్రీతి.. ఇతరులు చేసిన పనికి ఆయనను దూషించడం సరికాదు.  ఎవరో చేసిన పనికి రాహుల్‌ గాంధీ బాధ్యుడెలా అవుతారు? ఏదైనా సమస్యను నేరుగా పరిష్కరించడానికే ప్రయత్నిస్తాను తప్ప పరోక్ష యుద్ధాల ద్వారా కాదు. రాహుల్‌ గాంధీతో నాకు ఎటువంటి సమస్య లేదు. కాబట్టి ఆయనను ప్రశాంతంగా బతకనిద్దాం. అలాగే నేనూ శాంతియుతంగా జీవిస్తాను అని చెప్పుకొచ్చింది.

బీజేపీతో దోస్తీ అంటూ ఆరోపణలు
కాగా ఇటీవల కేరళ కాంగ్రెస్‌ పార్టీ ప్రీతిజింటాపై తీవ్ర ఆరోపణలు చేసింది. న్యూ ఇండియా కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ నుంచి నటి తీసుకున్న రూ.18 కోట్ల రుణాన్ని బీజేపీ మాఫీ చేసిందని ఆరోపించింది. అందుకుగానూ ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని ఆరోపించింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని ఆమె ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ప్రీతి లేదని బదులిచ్చింది. చాలా ఏళ్లుగా కొన్ని పార్టీలు టికెట్లు ఆఫర్‌ చేస్తున్నాయని, కానీ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. 

కంగనాను నమ్ముతున్నాను
అలాగే మన దేశంలోని సోషల్‌ మీడియా చాలా విషపూరితంగా మారిపోయిందని పేర్కొంది. ఏ చిన్న కామెంట్‌ చేసినా దాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారంది. తనకు రాజకీయాలంటే అస్సలు ఆసక్తి లేదని నొక్కి చెప్పింది. కంగనా (Kangana Ranaut) గురించి చెప్తూ.. ఆమె ఒక అద్భుతమైన నటి.. అలాగే ఫ్యాషన్‌ ఐకాన్‌. ఇప్పటివరకు డైరెక్టర్‌గా తను చేసిన పనిని చూడలేదు. కానీ మంచి దర్శకురాలు కాగలదని నమ్ముతున్నాను. రాజకీయ నాయకురాలిగా తన ప్రయాణానికి ఆల్‌ ద బెస్ట్‌. హిమాచల్‌ ప్రదేశ్‌వాసులకు అంతా మంచే చేస్తుందని నమ్ముతున్నాను అని ఎక్స్‌ (ట్విటర్‌)లో రాసుకొచ్చింది.

 

 

చదవండి: సెల్ఫీ ఇస్తా.. ఫ్రీగా దోసె వేసిస్తావా?.. చెఫ్‌ ఆన్సర్‌కు ఆశ్చర్యపోయిన నటి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)