Breaking News

ట్రెండింగ్ హీరోయిన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?

Published on Sat, 07/18/2026 - 16:19

మన దేశం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్తల్లో శ్రీనివాస రామానుజన్ ఒకరు. ఈయన గణిత సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈయన ఘనతలు గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. అయితే పుట్టినరోజు, వర్ధంతి లాంటివి ఇప్పుడేం లేవు అయినా సరే శ్రీనివాస రామానుజన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతున్నారు. దీనికి కారణం.  లేటెస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్.. ఈయనకు మునిమనవరాలు అవుతుందనే వార్త.

(ఇదీ చదవండి: రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్‌కి లక్కీ ఛాన్స్)

తమిళనాడులోని ఈరోడ్‌లో 1887లో పుట్టిన శ్రీనివాస రామానుజన్ 32 ఏళ్లకే మశూచి వ్యాధి బారినపడి చనిపోయారు. ఇదంతా జరగడానికి చాన్నాళ్ల క్రితమే జానకి అమ్మళ్ అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్లకు ఎలాంటి సంతానం లేదు. కానీ గత రెండు రోజుల నుంచి హీరోయిన్ ప్రీతి ముకుందన్ తల్లికి శ్రీనివాస రామానుజన్‌తో బంధుత్వం ఉందని, తద్వారా ప్రీతి, రామానుజన్‌కి ముని మనవరాలు అవుతుందని అంటున్నారు.

కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని అనిపిస్తుంది. శ్రీనివాస రామానుజన్ చనిపోయిన ముప్పై ఏళ్ల తర్వాత జానకి అమ్మళ్.. డబ్ల్యూఎస్ నారాయణ్ అనే వ్యక్తిని పెంచుకుందని చెప్పి గూగుల్‌లో ఉంది. బహూశా ఈయన తర్వాత తరం వాళ్లతో ప్రీతి ముకుందన్ కుటుంబానికి ఏమైనా బంధుత్వం ఉంటే ఉండాలి. ఒకవేళ ఉన్నాగానీ ఈ విషయం గురించి ప్రీతి స్పందిస్తే తప్పితే ఏదో ఒకటి క్లారిటీ రాదు.

ప్రీతి ముకుందన్ విషయానికొస్తే.. ఓం భీం బుష్, కన్నప్ప లాంటి తెలుగు సినిమాలు చేసింది గానీ ఈమెకు సక్సెస్ రాలేదు. తమిళంలో ఈ ఏడాది వచ్చిన 'బ్లాస్ట్' ఈమె ఫేట్ మార్చింది. ఓవర్ నైట్ సెన్సేషన్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Videos

Open AI CTO ఉదయ్ రుద్దరాజుకు YS జగన్ అభినందనలు

APలో 3 రోజులు భారీ వర్షాలు.. IMD బిగ్ అలర్ట్..!

మీరు దొరికిపోయే టైం వచ్చేసింది... పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

ధరేంద్ర ప్రధాన్ రాజీనామాపై జేపీ నడ్డాతో కాక్రోచ్ నేతల భేటీ

ఢిల్లీలో హైటెన్షన్.. ధరేంద్ర ప్రధాన్ రాజీనామాకు CJP డిమాండ్

ISRO పని ఖతం..? ప్రైవేటీకరణపై బయటకు వస్తున్న సంచలన విషయాలు

బ్రేకింగ్ న్యూస్..సాయి కృష్ణ ఇంటికి సిట్ అధికారులు

అంతా కోహ్లి వల్లే.. రిటైర్మెంట్ పై తొలిసారి స్పందించిన రోహిత్

నూర్ ఫాతిమా ఆగ్రహం.. "కొంచమైనా బుద్ధుందా?"

మహిళా బట్టలు చించేస్తే ... ఈవిడిగారు ఏం మాట్లాడుతుందో చుడండి

Photos

+5

శ్రీనివాస మంగాపురం హీరో బర్త్‌ డే.. హీరోయిన్ స్పెషల్ విషెస్ (ఫోటోలు)

+5

ముంబై : అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన బాలీవుడ్‌ భామలు (ఫొటోలు)

+5

విజయవాడ : ఆషాఢ వైభవం..‘ఇంద్ర’ వైభోగం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మురిపించిన మెరుపు తీగలు (ఫొటోలు)

+5

FIFA World Cup 2026 : ఫిఫా 2026 విశ్వవిజేత స్పెయిన్‌ (ఫొటోలు)

+5

స్టన్నింగ్ లుక్స్‌లో కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

పట్టు చీరలో నభా నటేష్‌ అందాల మెరుపులు (ఫొటోలు)

+5

తెల్లని చీరలో శ్రీదేవి విజయ్‌కుమార్‌ మనసు దోచే అందాలు (ఫొటోలు)

+5

సింపుల్‌గా వంక పెట్టలేనంత అందంగా హీరోయిన్ (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో కలిసి టాలీవుడ్ హీరోయిన్ నైట్ పార్టీ (ఫొటోలు)