Breaking News

అందుకే సినిమాలకు దూరమయ్యా..: తమ్ముడు హీరోయిన్‌

Published on Sat, 07/15/2023 - 19:09

తమ్ముడు, నరసింహనాయుడు, అప్పారావ్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ వంటి పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్‌ ప్రీతి జింగానియా. తర్వాత బాలీవుడ్‌ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్‌ చేసిన ఈ బ్యూటీ మధ్యలో ఓసారి తేజం సినిమాలో ఐటం సాంగ్‌లో మెరిసింది. 2007లో వచ్చిన విక్టోరియా నెం. 203 సినిమా  తర్వాత మరే హిందీ చిత్రంలోనూ కనిపించలేదు. బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ఇటీవలే 'కఫాస్‌' వెబ్‌ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది.

తాజాగా ఆమె సినిమాలకు దూరమవడానికి గల కారణాలను వెల్లడించింది. 'నేను కోరుకున్న రోల్స్‌ నాకు రాలేదు. నాకు వచ్చిన పాత్రలతో నేను సంతోషంగా లేను. సినిమాలో కీలకమైన పాత్ర చేయాలని ఉండేది. అలా అని సినిమాలో నేనే హైలైట్‌ అవ్వాలని చెప్పడం లేదు. కనీసం కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలంటున్నాను. అదే నేను కోరుకుంది. కానీ అటువంటి పాత్రలు నా దాకా రానేలేదు. అలాంటప్పుడు ఏదో ఒకటి నేను నిరాశకు లోనవడం, నా అభిమానులను నిరుత్సాహపరచడం ఎందుకని ఒక అడుగు వెనక్కు వేశాను.

విక్టోరియా నెం.203 తర్వాత నేను ఏ హిందీ సినిమా చేయలేదు, కానీ పలు ప్రాంతీయ భాషల్లో నటించాను. ఈవెంట్లు, షోలు.. ఇలా చాలా చేశాను. కాబట్టి సినిమాలకు నేను దూరంగా ఉన్నానని ఎప్పుడూ ఫీలవలేదు. కాకపోతే బాలీవుడ్‌ చిత్రాల్లో నటించడాన్ని మిస్‌ అయ్యాను. ఇప్పుడు నేను తిరిగొచ్చేశాను, మళ్లీ కెమెరా ముందు యాక్ట్‌ చేస్తున్నాను. సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది ప్రీతి జింగానియా.

చదవండి: శామీర్‌పేట్‌ ఘటన.. నా పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ నటుడు సీరియస్‌

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)