Breaking News

ఈ సినిమాకి ఆదరణ లభించడం ఆనందం: దర్శకురాలు ప్రవీణ

Published on Mon, 07/21/2025 - 00:46

‘‘ఓ సినిమా తీసి, దాన్ని రిలీజ్‌ చేసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్లడం పెద్ద టాస్క్‌. అయితే ఈ జర్నీ ఎంత కష్టమైనా ఆడియన్స్‌ నుంచి మంచి ఆదరణ లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఒక నమ్మకం గురించిన కథ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా. లైట్‌ హార్టెడ్‌ కామెడీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి... మంచి అనుభూతినిస్తుంది’’ అని అన్నారు ప్రవీణ పరుచూరి. మనోజ్‌ చంద్ర, మోనికా .టి, ఉషా బోనేలా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. రానా సమర్పణలో ప్రవీణ పరుచూరి ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

ఈ చిత్రం ఈ నెల 18న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోందని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో మనోజ్‌ చంద్ర మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేను పోషించిన రామకృష్ణ పాత్రకు ఆడియన్స్‌ కనెక్ట్‌ అయ్యారు. ఇలాంటి మరిన్ని సినిమాలకు రానాగారు సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చాలా మంచి సినిమా ఇది. థియేటర్స్‌లో చూసి, ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు టి. మోనిక, ఉషా బోనేలా. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్‌ మెహరా బాబా మాట్లాడారు.  
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)