Breaking News

ఓటీటీలోకి మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా

Published on Sat, 04/18/2026 - 15:19

దాదాపు పదేళ్ల క్రితం 'ప్రేమమ్' సినిమాతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరో నివిన్ పౌలీ.. తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేకపోయాడు. చాన్నాళ్ల తర్వాత గతేడాది చివరలో 'సర్వం మాయ' చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత రెండు మూవీస్ చేశాడు. అందులో ఒకటి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)

నివిన్ పౌలీ చేసిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 'ప్రతిఛాయ'. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే రొటీన్ స్టోరీ ఉండేసరికి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు దీన్ని నెలలోపే అంటే వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగు డబ్బింగ్ కూడా ఉందా లేదా అనేది ప్రస్తుతానికి క్లారిటీ ఇవ్వలేదు. దాదాపుగా రావొచ్చనే తెలుస్తోంది.

'ప్రతిఛాయ' విషయానికొస్తే.. కేరళ ముఖ్యమంత్రిగా వర్గీస్, నిజాయితీపరుడైన నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. ఈయన పెద్ద కొడుకు జాన్, రాజకీయాలకు దూరంగా ఉంటూ ఐటీ ఉద్యోగం చేస్తుంటాడు. మరో కొడుకు టోబిన్, తండ్రి అడుగుజాడల్లోనే యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. వర్గీస్ తనని లైంగికంగా వేధించాడని నిశా అనే మహిళ ఆరోపణలు చేస్తుంది. దీంతో సీఎం పదవికి వర్గీస్ రాజీనామా చేస్తాడు. ఈ ఆరోపణలు వెనకున్న నిజానిజాలు బయటపెట్టాలని జాన్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే అతడికి తెలిసిన నిజాలేంటి? రాజకీయాల్లో అడుగుపెట్టిన జాన్‌కి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలో సెన్సేషనల్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం ఒన్ను' తెలుగు రివ్యూ)

Videos

అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్

ముగ్గువేసి మనసులు గెలిచిన విజయ్

మహిళా బిల్లుపై బాబు కుట్ర ఆధారాలతో బయటపెట్టిన MLC లేళ్ల అప్పిరెడ్డి

అంతా బోగస్.. సుమన్ శెట్టి షాకింగ్ నిజాలు

విజయ్ కి అంత సీన్ లేదు...ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..

మమ్మల్ని హింసించిన వారిని 2029 తరువాత కులం,మతం చూడకుండానే బొక్కలో వేస్తాం

నా రైట్స్ నాకే..! హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

ఆల్కా అదిరిపోయే ఆఫర్ 100 షేర్లు కొంటే 600షేర్లు ఫ్రీ

Photos

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)