Breaking News

ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్‌ మూవీ ఆగిపోయిందా?.. అసలు నిజమెంత?

Published on Wed, 10/22/2025 - 15:45

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఈ సినిమాను ఎన్టీఆర్‌నీల్‌ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ పాన్ ఇండియా చిత్రంపై నెట్టింట కొన్ని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ఇలాంటి బ్యాడ్ న్యూస్ రావడం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్ మధ్య కంటెంట్‌ సృజనాత్మక విషయంలో విభేదాలు వచ్చాయని కొందరు అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తిగా ఉన్నారట. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్‌ రావడంతోనే ఈ మూవీ ఆగిపోయిందని నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్‌ కానీ.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. 

దీనిపై మేకర్స్ స్పందిస్తేనే క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్‌ అనే టైటిల్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2026 జూన్‌ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఇప్పటికే వెల్లడించారు.
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)