Breaking News

రాఖీ పండగరోజు ప్రభాస్‌ చెల్లి ఇలా చేసిందేంటి?

Published on Sun, 08/10/2025 - 11:37

దివంగత నటుడు కృష్ణంరాజు కూతుర్లలో ప్రసీద ఉప్పలపాటి (Sai Praseedha Uppalapati) ఒక్కరే సోషల్‌ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. పండగలు, హాలీడే ట్రిప్‌, ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్‌, ఫ్యామిలీతో కాలక్షేపం, అన్న ప్రభాస్‌తో ఫన్నీ టైమ్‌.. ఇలా ఏవైనా సరే అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ ఉంటుంది. దీంతో ఆమె రక్షా బంధన్‌ రోజు ప్రభాస్‌ (Prabhas)కు రాఖీ కట్టిన ఫోటో ఎప్పుడెప్పుడు షేర్‌ చేస్తుందా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు.

రాఖీ పోస్ట్‌
తీరా ప్రసీద ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టనే పెట్టింది. తను ఎవరెవరికైతే రాఖీ కట్టిందో వాళ్లందరి ఫోటోలు షేర్‌ చేసింది. కానీ ప్రభాస్‌ పిక్‌ మాత్రం షేర్‌ చేయలేదు. దీంతో అభిమానులు ప్రభాస్‌ అన్న ఎక్కడ? తన ఫోటో ఎందుకు వదిలేశావ్‌? అని నిరాశతో కామెంట్లు పెడుతున్నారు. నిజానికి ప్రసీద.. ప్రభాస్‌కు రాఖీ కట్టింది. అందుకు ఫస్ట్‌ ఫోటోనే నిదర్శనం.

నిరాశలో ప్రభాస్‌ అభిమానులు
ప్రభాస్‌ రాఖీ కట్టించుకున్న చేతి ఫోటోను మాత్రమే అప్‌లోడ్‌ చేసింది. దానికి ప్రభాస్‌ను కూడా ట్యాగ్‌ చేసింది. గతంలో ప్రభాస్‌కు రాఖీ కడుతూ దిగిన ఫోటోలు షేర్‌ చేసే ప్రసీద.. ఈసారి ఇలా డిసప్పాయింట్‌ చేసిందేంటని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అతడు ది రాజాసాబ్‌, ఫౌజీ (వర్కింగ్‌ టైటిల్‌), స్పిరిట్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవే కాకుండా సలార్‌ 2, కల్కి 2 చిత్రాలు చేయనున్నాడు.

 

 

చదవండి: మృణాల్‌ అయితే బాగుంటుందన్న స్టార్‌ హీరో!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)