Breaking News

12 భాషలలో 'ఓటీటీ ప్లాట్‌'ఫామ్‌ను ప్రకటించిన ప్రసార భారతి

Published on Sat, 11/23/2024 - 14:49

సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక కాలంలో కాలక్షేప మాధ్యమాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే పలు ప్రైవేట్‌ ఓటీటీ సంస్థలు పలు ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పట్టికలో వేవ్స్‌ పేరుతో మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వచ్చింది. 

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రసారం అవుతున్న ప్రసార భారతి ఈ ఓటీటీని భారత్‌ నెట్‌వర్క్‌ సంస్థతో కలిసి ప్రారంభించింది. ఈ ఓటీటీలో ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాత్‌, పంజాబీ, అస్సామీ తదితర 12 భాషలలో 10కి పైగా వివిధ రకాల ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలను ప్రసారం చేయనుందని వేవ్స్‌ ఓటీటీ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. 

వీటితోపాటు ఆకాశవాణి ప్రసారాలు, 65కు పైగా టీవీ ఛానళ్ల ప్రసార కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. మంకీ కింగ్‌ హీరో, టాకీ అవెంజర్స్‌, చోటా భీమ్‌, తెనాలి రామన్‌, అక్బర్‌ బీర్బల్‌ తదితర సీరియళ్లు వేవ్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతాయన్నారు. అలా అన్ని వర్గాలు ప్రేక్షకులను అలరించే ప్రసారాల్లో భాగంగా సంగీత, భక్తిరస కార్యక్రమాలు చోటు చేసుకుంటాయని నిర్వాహకులు తెలిపారు.

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)