Breaking News

ప్రభాస్‌‘స్పిరిట్‌’షూటింగ్‌.. హైదరాబాద్‌లోనే ఎందుకంటే?

Published on Tue, 09/01/2026 - 15:40

ప్రభాస్‌ కథానాయకుడిగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్‌. ఈ చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌  హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే ఎందుకు జరుపుతున్నారో ప్రణయ్‌ వంగా తెలిపారు.

ఓ కార్యక్రమంలో పాల్లొన్న ప్రణయ్‌ వంగా స్పిరిట్‌ షూటింగ్‌ కోసం మాట్లాడుతూ..  ‘ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో సినిమా నిర్మాణ వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన యానిమల్‌ను ముంబై కేంద్రంగా తెరకెక్కించడం వల్ల 20% నుంచి 30% వరకు అధికంగా ఖర్చయింది. అదే హైదరాబాద్‌లో నిర్మించుంటే చాలా డబ్బులు ఆదా అయ్యేవి. ఆ అనుభవంతోనే ప్రభాస్‌ నటిస్తున్న స్పిరిట్‌ సినిమాను హైదరాబాద్‌లోనే నిర్మిస్తున్నాం’ అని చెప్పారు.

ఇదీ చదవండి: నాకూ బ్రేకప్‌ అయింది: విజయ్‌ దేవరకొండ

ఎందుకు ఎక్కువ అంటే..
‘ముంబైలో స్టూడియో స్థలం, మౌలిక వసతుల కొరత కారణంగా షూటింగ్‌ ఖర్చులు పెరుగుతాయి. ఇక్కడ సెట్‌ నిర్మాణానికి అవసరమైన స్థలం, ఇతర వసతులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చిత్ర పరిశ్రమలో ఒకరికొకరు సహకరించే సంస్కృతి కూడా ఉంది. పని వేళల్లో కూడా మార్పు ఉంటుంది​’ అని వెల్లడించారు.  

సినిమా విషయానికి వస్తే..
పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రాల్లో స్పిరిట్‌ ఒకటి. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌. వివేక్‌ ఒబెరాయ్‌, సీనియర్‌ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు. భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృష్ణన్‌ కుమార్‌, ప్రభాకర్‌ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2027 మార్చి 5న విడుదల కానుంది.

ఎక్కువ మంది చదవింది: పెళ్లి పీటలెక్కనున్న బలగం బ్యూటీ.. వరుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)