Breaking News

'తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే..'.. ప్రకాశ్ రాజ్

Published on Wed, 11/12/2025 - 16:30

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సినీనటుడు ప్రకాశ్ రాజ్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో జూలై 30న ఈడీ ముందు హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాగా.. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్‌లో నమోదైన కేసులను  సీఐడీకి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. విచారణ అనంతరం ప్రకాశ్‌ రాజ్‌ మీడియాతో మాట్లాడారు.

ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..'నోటీసులు రావడంతోనే సీఐడీ విచారణకు హాజరయ్యా. బ్యాంకు స్టేట్‌మెంట్స్ అన్ని గతంలోనే సమర్పించా. 2016లో బెట్టింగ్ యాప్‌కి ప్రమోషన్ చేశా. 2017లో బెట్టింగ్ యాప్‌లను నిషేధించారు. బెట్టింగ్ యాప్ ఎవరు వాడకండి. యువత బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లొద్దు.. అడ్డదారిలో వెళ్లకండి. తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే. సీఐడీ విచారణలో బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించిన సమాచారం ఇచ్చా. బెట్టింగ్ యాప్స్ అనేది పూర్తిగా రాంగ్ వే. బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టకండి. ముఖ్యంగా యంగ్ స్టార్స్ అర్థం చేసుకోవాలి. వీటివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. అది బాధాకరమైన విషయం' అని అన్నారు.

కాగా.. ఈ బెట్టింగ్ యాప్ కేసులో జూలై 30న   ప్రకాష్ రాజ్  ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. జంగిల్ రమ్మీ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. ప్రకాశ్‌ రాజ్‌తో పాటు పలువురు టాలీవుడ్ తారలు కూడా సీఐడీ ఎదుట హాజరయ్యారు. టాలీవుడ్ హీరో విజయ్‌దేవరకొండ కూడా సీఐడీ  విచారణ ఎదుర్కొన్నారు. మంగళవారం  గంటకుపైగా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. కాగా.. గతంలో బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 

Prakash Raj: అవును.. నేను చేసింది తప్పే
 

Videos

Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్

జగన్ కట్టించిన ఇళ్లకు... చంద్రబాబు హంగామా

Prakash Raj: అవును.. నేను చేసింది తప్పే

మీడియాను ఘోరంగా అవమానించిన లోకేష్

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

కేతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ

మా MROలు వేస్ట్.. జనసేన నేత సంచలన కామెంట్స్

Vidadala Rajini: రాసిపెట్టుకోండి.. జగనన్న ఒకసారి చెప్పాడంటే

New Delhi: పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన మోదీ

కపిలతీర్థంలో అయ్యప్ప స్వాములకు అవమానం

Photos

+5

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (ఫొటోలు)

+5

ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రీ రిలీజ్ లో మెరిసిన చాందినీ చౌదరి (ఫొటోలు)

+5

వణికిస్తున్న చలి.. జాగ్రత్తగా ఉండాల్సిందే (ఫొటోలు)

+5

అల్లరి నరేశ్ 12ఏ రైల్వే కాలనీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రెహమాన్ కన్సర్ట్ జ్ఞాపకాలతో మంగ్లీ (ఫొటోలు)