Breaking News

బాలీవుడ్‌ అమ్ముడు పోయింది.. ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు!

Published on Tue, 05/06/2025 - 13:48

ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌(Prakash Raj ) బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో సగం మంది నటీనటులు ప్రభుత్వానికి అమ్ముడుపోయారని, అందుకే వారు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించే ప్రకాశ్‌ రాజ్‌, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడానికి కారణాలను వివరించారు.

“నేను సూటిగా మాట్లాడతాను. రాజకీయ పరిణామాలపై నా అభిప్రాయాన్ని బహిరంగంగా చెబుతుంటాను. దీని వల్ల భవిష్యత్తులో తమకు ఇబ్బందులు వస్తాయని భావించి, నాకు అవకాశాలు ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసిన తర్వాతే నేను గళం విప్పాలని నిర్ణయించుకున్నాను,” అని ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నించాలనే ఆలోచన చాలా మందిలో ఉన్నప్పటికీ, ధైర్యంతో ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“సినిమా పరిశ్రమలో సగం మంది అమ్ముడుపోయినవారే. కొంతమంది మంచివారు ఉన్నప్పటికీ, ప్రశ్నించే ధైర్యం లేదు. నా సన్నిహిత మిత్రుడు ఒకరు, ‘ప్రకాశ్‌, నీకు ధైర్యం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నావ్‌, మాకు అంత ధైర్యం లేదు’ అని చెప్పారు. వారి పరస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ, చరిత్ర నేరాలు చేసిన వారిని క్షమించినా, మౌనంగా ఉండేవారిని మాత్రం క్షమించదు. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి,” అని ఆయన స్పష్టం చేశారు.

ప్రకాశ్‌ రాజ్‌ ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన తాజాగా సూర్య నటించిన ‘రెట్రో’ చిత్రంలో కనిపించారు. పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘ఓజీ’, విజయ్‌ నటిస్తున్న ‘జన నాయగన్‌’ చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)