పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు
Breaking News
MAA Elections: ప్రకాశ్‌రాజ్ వర్సెస్ మంచు విష్ణు!
Published on Tue, 06/22/2021 - 08:12
తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల పోరు ఈసారి రసవత్తరంగా ఉంటుందని ఫిల్మ్‌నగర్ హాట్ టాపిక్. నటుడు ప్రకాశ్‌రాజ్ ఇప్పటికే ‘మా’ అధ్యక్షుడి స్థానం కోసం బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పోటీలో నిలబడనున్నట్లు వార్త వచ్చింది.
అటు సీనియర్ నటుడు ఇటు యంగ్ హీరో అధ్యక్ష పదవికి పోటీ పడటం అంటే చర్చనీయాంశమే. ఒకవైపు ప్రకాశ్‌రాజ్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విష్ణు కూడా సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులను స్వయంగా కలుస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. ఇద్దరూ ఏ ఎజెండాతో ముందుకొస్తారో చూడాలి.
చదవండి: పెళ్లి వాయిదా అనంతరం క్రేజీ ఆఫర్ కొట్టేసిన మెహ్రీన్!
Tags : 1