Breaking News

ఏడు ఎపిసోడ్లుగా ఏకం.. ట్రైలర్‌ చూశారా?

Published on Mon, 07/08/2024 - 13:59

ప్రకాశ్‌ రాజ్‌, రాజ్‌ బి శెట్టి, షైన్‌ శెట్టి, మానసి సుధీర్‌, ప్రకాశ్‌ తుమినడ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన వెబ్‌ సిరీస్‌ ఏకం. ఇందులో ఏడుగురి జీవితాలను ఏడు ఎపిసోడ్‌లుగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌ కోసం ఏకంగా ఐదుగురు దర్శకులు పని చేశారు. సుమంత్‌ భట్‌, స్వరూప్‌ ఎలమొన్‌, సనల్‌ అమన్‌, శంకర్‌ గంగాధరన్‌, వివేక్‌ వినోద్‌ దర్శకత్వం వహించారు. వీరిలో సనల్‌, వివేక్‌ మినహా మిగతా ముగ్గురూ స్క్రీన్‌ప్లే అందించారు. ఈ స్క్రీన్‌ప్లేకు జీఎస్‌ భాస్కర్‌ అనే వ్యక్తి కూడా సాయం చేశాడు. ఈ సిరీస్‌ జూలై 13న ఏకం ద సిరీస్‌ (https://www.ekamtheseries.com/) వెబ్‌సైట్‌లో విడుదల కానుంది.

భావోద్వేగాల సమ్మేళనం
ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ప్రేమ, భయం, ధైర్యం, బాధ.. ఇలా అన్నిరకాల ఎమోషన్స్‌ను రంగరించారు. ఎంతో సహజసిద్ధంగా కనిపిస్తున్న ఈ సిరీస్‌ ఓటీటీలో రిలీజ్‌ అయ్యుంటే ఎక్కువమంది చూసే ఆస్కారం ఉండేది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఈ సిరీస్‌ను తిరస్కరించడంతో మరో అవకాశం లేక సొంత ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తెస్తున్నారు.

పట్టించుకోని ఓటీటీలు
ఈ విషయాన్ని కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి ఇటీవలే సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. '2020 జనవరిలో ఏకం ప్రాజెక్ట్‌ మొదలుపెట్టాం. కరోనా వల్ల కాస్త ఆలస్యమైంది. 2021 అక్టోబర్‌లో ఫైనల్‌ కట్‌ చూసి ఆశ్చర్యపోయాను. ఈ అద్భుతమైన సిరీస్‌ను ప్రపంచానికి చూపించాలని ఆరాటపడ్డాను. కానీ ఎంత ఎదురుచూసినా, ప్రయత్నించినా ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కూడా ఏకం తీసుకోవడానికి ముందుకు రాలేదు. అందుకే మా సొంత ప్లాట్‌ఫామ్‌లోనే దీన్ని రిలీజ్‌ చేస్తున్నాం. తప్పకుండా మీరు దాన్ని ఎంజాయ్‌ చేస్తారు' అని ట్వీట్‌ చేశాడు.

 

చదవండి: అమ్మ ఎక్కడ? అని అడుగుతున్నారు.. ఏం చెప్పాలో.. ఏంటో?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)