Breaking News

పవన్‌ కల్యాణ్‌.. విధ్వంస రాజకీయం చేస్తున్నాడు: ప్రకాష్‌ రాజ్‌

Published on Sun, 10/27/2024 - 11:02

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాజకీయ తీరుపై ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో పవన్‌ చేస్తున్న పాలిటిక్స్‌పై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు.  సనాతన ధర్మం పేరుతో పవన్‌ చేస్తున్న రాజకీయంపై ఆయన పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన మాట్లాడిన మాటలు వైరల్‌ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: శ్రీకాంత్ అయ్యంగర్.. ఏంటీ నోటి దురుసు?)

ఏబీపీ స‌ద‌ర‌న్ రైజింగ్ స‌మ్మిట్‌లో పాల్గొన్న ప్రకాష్‌ రాజ్‌.. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ అంటే మీకెందుకు అంత కోపం? అని అడగ్గా.. పవన్‌ కల్యాణ్‌ మూర్ఖత్వంగా రాజకీయాలు చేస్తున్నాడు. విధ్వంస రాజకీయం చేస్తున్నాడు. అది నాకు నచ్చడం లేదు. అది మాత్రమే చెబుతున్నాను. ప్రజలు ఆయన్ను ఎన్నుకుంది ఇలాంటి పాలిటిక్స్‌ కోసం కాదు కదా? ప్రజల తరుపున పవన్‌‌ని అడిగేవారు కూడా ఉండాలి కదా! మతం పేరుతో రాజకీయం చేసి అయోధ్యలో (బీజేపీ) ఓడిపోయారు. ఇప్పుడు మన కొండ ఎక్కడానికి వచ్చారు. మత తత్వ రాజకీయాలు మన దక్షిణ భారతదేశంలో బలపడే అవకాశం ఉండదు' అని ప్రకాశ్ రాజ్ అన్నాడు.

తనకు సినిమా ఛాన్సులు రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ప్రకాష్‌ రాజ్‌ ధీమా వ్యక్తం చేశాడు. సినిమాలు వస్తూనే ఉన్నాయి.. పనిచేస్తూనే ఉన్నాను ఎవరైనా ఆపగలరా అని అన్నాడు. తన వల్ల సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఇబ్బంది పడలేదని.. సమాజంలో జరిగే త‌ప్పుల‌ను చూస్తూ నోరు మెద‌ప‌కుండా ఉండ‌లేనని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు సినిమా అవ‌కాశాలు కోల్పోయినా ప్ర‌శ్నించ‌డం మాత్రం ఆపనని ప్రకాష్‌ రాజ్‌ బలంగా చెప్పారు.

(ఇదీ చదవండి: వీడియో షేర్‌ చేస్తూ 'సాయి పల్లవి'ని టార్గెట్‌ చేస్తుందెవరు..?)

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)