ఆ రెండు చిత్రాల కంటే ‘డ్యూడ్‌’కే ఎక్కువ కలెక్షన్స్‌: ప్రదీప్‌ రంగనాథన్‌

Published on Sun, 10/19/2025 - 11:06

‘‘డ్యూడ్‌’ సినిమాను అద్భుతంగా రిసీవ్‌ చేసుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌. మీరు అందిస్తున్న ప్రేమ మర్చిపోలేనిది. నేను హీరోగా నటించిన ‘లవ్‌ టుడే, రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఆ రెండు చిత్రాలకు మించిన ఆదరణ, అభిమానం ‘డ్యూడ్‌’ సినిమాకి చూపిస్తున్నారు. నా గత చిత్రం ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ కంటే తొలి, మలి రోజుల్లోనే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్‌ ‘డ్యూడ్‌’ సినిమాకు వచ్చాయని మా నిర్మాతలు చెబుతుంటే ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని ప్రదీప్‌ రంగనాథన్‌ అన్నారు. 

ప్రదీప్‌ రంగనాథన్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా, ఆర్‌. శరత్‌కుమార్‌ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్‌’. కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

ఈ సందర్భంగా ‘డ్యూడ్‌ దివాళి బ్లాస్ట్‌’ పేరిట నిర్వహించిన సమావేశంలో ప్రదీప్‌ రంగనాథన్‌ మాట్లాడుతూ– ‘‘తమిళనాడులోనూ నా గత చిత్రాలకంటే ‘డ్యూడ్‌’కు ఎక్కవ కలెక్షన్స్‌ వస్తున్నాయి’’ అని తెలిపారు. నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘ప్రదీప్‌గారి గత సినిమాలతో పోల్చుకుంటే కొన్ని ఏరియాల్లో నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్‌ ‘డ్యూడ్‌’కు వస్తున్నాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ‘డ్యూడ్‌’ దివాళి బిగ్‌ విన్నర్‌’’ అని ప్పారు. ‘‘జెన్‌ జి కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ ఎమోషన్స్‌ బ్లెండ్‌ అయిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అని తెలి΄ారు వై. రవిశంకర్‌. మైత్రి డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి మాట్లాడారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)