Breaking News

ప్రదీప్‌ రంగనాథన్‌ బిగ్‌ ప్లాన్‌.. మరో హిట్‌ గ్యారెంటీనా?

Published on Fri, 06/13/2025 - 13:36

కోలీవుడ్‌లో 'కోమాలి' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్‌ రంగనాథన్‌ ఎంట్రీలోనే అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత లవ్‌టుడే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై తనే దర్శకత్వం వహించి సూపర్‌హిట్‌ కొట్టారు. ఇటీవల డ్రాగన్‌ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని సాధించారు. ఇలా వరుసగా హీరోగా, దర్శకుడిగా విజయాలను అందుకున్న ప్రదీప్‌ ప్రస్తుతం విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వంలో ఎల్‌ఐకే చిత్రంతో పాటు కీర్తీవాసన్‌ దర్శకత్వంలో టాలీవుడ్‌ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ నిర్మిస్తున్న డ్యూడ్‌ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. 

ఈ రెండు చిత్రాల షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కాగా తాజాగా మరో సారి ఈయన మెగాఫోన్‌ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీన్ని లవ్‌టుడే చిత్రాన్ని నిర్మించి సూపర్‌హిట్‌ కొట్టిన ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మించనుంది. ఇది సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రదీప్‌ రంగనాథన్‌ దర్శకత్వం మాత్రమే చేస్తారా లేక కథానాయకుడిగానూ నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తివివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అకాశం ఉంది.    

Videos

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)