Breaking News

ప్రభాస్‌కు ఏమైంది? ఫ్యాన్స్‌ ఆందోళన

Published on Tue, 10/04/2022 - 11:36

ఆదిపురుష్‌ టీజర్‌ ఈవెంట్‌లో ప్రభాస్‌ను చూసి ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌కు ఏమైందని అభిమానులంతా కంగారు పడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం (అక్టోబర్‌ 2న) అయోధ్యలో ఆదిపురుష్‌ టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈవెంట్‌లో డైరెక్టర్‌ ఓంరౌత్‌, హీరోయిన్‌ కృతీసన్‌తో కలిసి ప్రభాస్‌ నడుస్తూ వస్తున్నాడు. అయితే అక్కడ ప్రభాస్‌ నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. అది చూసి డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఈవెంట్‌లో నడవడానికి ఇబ్బంది పడిన ప్రభాస్‌ మెట్లు దిగే సమయంలో వెంటే వస్తున్న ఓంరౌత్‌, కృతీ సనన్‌ సాయం తీసుకున్నాడు. 

చదవండి: ఆదిపురుష్‌ టీజర్‌.. డైరెక్టర్‌ ఓంరౌత్‌పై బీజేపీ మండిపాటు

చూస్తుంటే ప్రభాస్‌ మోకాలి నొప్పితో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆమధ్య ప్రభాస్‌ మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. బాహుబలి మూవీ షూటింగ్‌ సమయంలో ప్రభాస్‌ మోకాలికి గాయం అయింది. అయితే గాయానికి ప్రభాస్‌ సర్జరీ చేయించుకోవాల్సి ఉండగా రాధేశ్యామ్, సలార్‌ షూటింగ్‌తో బిజీగా ఉండటం వల్ల పోస్ట్‌పోన్‌ చేసుకున్నాడు. ఇక రాధేశ్యామ్‌ రిలీజ్‌ అనంతరం ప్రభాస్‌ గత ఏప్రిల్‌లో మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసందే. అయితే ఇప్పుడు అదే గాయం ఆయనను బాధపెడుతుందా? అని ఫ్యాన్స్‌ విచారం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులంతా కామెంట్స్‌ చేస్తున్నారు. 

చదవండి: రిపోర్టర్‌పై నటి హేమ ఫైర్‌.. ‘భక్తి కోసం వచ్చా కాంట్రవర్సికి కాదు’

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)