కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు
Breaking News
కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను డైరెక్ట్‌గా అడిగేసిన బాలయ్య
Published on Fri, 12/30/2022 - 09:37
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. కానీ ప్రభాస్ ఎపిసోడ్ మాత్రం నెవర్ బిఫోర్ అన్నట్లుంది. డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకు ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయ్యిందంటే కటౌట్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేసిన వెంటనే ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో ఆహాలోకి ఎంట్రీ ఇవ్వడంతో సైట్ క్రాష్ అయింది.
సమస్యను పరిష్కరించిన ఆహా టెక్కికల్ టీమ్ ఇప్పటికే ఎపిసోడ్‌ను లోడ్ చేసేసింది. ఇక ఎప్పటిలాగే షోను ఆద్యంతం రక్తికట్టించే బాలయ్య ప్రభాస్‌ను తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. హీరోయిన్ కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను డైరెక్ట్‌గా అడిగేశాడు బాలయ్య. దీనికి ప్రభాస్.. మేడమ్ ఆల్రెడీ చెప్పేసిందిగా. అలాంటిదేమీ లేదు. ఇది కేవలం పుకారు మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో మేడమ్ ఏంటి? అంత రొమాన్స్ ఏంటి? నేను కూడా నా భార్య(వసుంధర)ను మేడమ్ అనే పిలుస్తానంటూ ప్రభాస్‌ను రోస్ట్ చేశాడు.
Kriti Sanon topic 😂😍#PrabhasOnAHApic.twitter.com/EFoly9GjJv
— Prabhas Youth Icon✪ᴬᵈᶦᵖᵘʳᵘˢʰ🏹 (@REBELST99790410) December 29, 2022
Funny convo about #Prabhas - #KritiSanon rumours 🤣👌... pic.twitter.com/tl7Vhhpi7i
— Nikhil Prabhas ™ (@rebelismm) December 29, 2022
Tags : 1