Breaking News

ముగ్గురు భామలతో నాచే.. నాచే...

Published on Tue, 01/06/2026 - 01:11

‘నాచే నాచే...’ అంటూ ముగ్గురు భామలతో ఆడి పాడుతున్నారు ప్రభాస్‌. ఆయన హీరోగా రూపొందిన తాజా పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.

తమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘నాచే నాచే...’ అంటూ సాగే సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ని ముంబైలో నిర్వహించారు. ఈ పాటలో నిధి, మాళవిక, రిద్దీలతో కలిసి స్టెప్పులేశారు ప్రభాస్‌. ఈ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి ఇప్పటివరకు ‘కార్తికేయ, జాట్, మిరాయ్‌’ వంటి సినిమాలను బాలీవుడ్‌లో రిలీజ్‌ చేశాం. ఇప్పుడు మా సంస్థలో బిగ్గెస్ట్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌గారితో ‘ది రాజా సాబ్‌’ వంటి పెద్ద సినిమా నిర్మించాం’’ అని తెలిపారు.

‘‘ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్‌ చె΄్పాను’’ అన్నారు రిద్దీ కుమార్‌. ‘‘పెద్దలతో పాటు పిల్లలకు కూడా మా సినిమా బాగా నచ్చుతుంది’’ అన్నారు మాళవికా మోహనన్‌. ‘‘రాజా సాబ్‌’లో వీఎఫ్‌ఎక్స్‌ సహజంగా ఉంటాయి. స్క్రీన్‌ మీద సన్నివేశాలు చూస్తుంటే నిజమైన అనుభూతి కలుగుతుంది’’ అని నిధీ అగర్వాల్‌ పేర్కొన్నారు. నటీనటులు జరీనా వాహబ్, బొమన్‌ ఇరానీ మాట్లాడారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)