Breaking News

'రాజాసాబ్'పై కొత్త రూమర్స్.. మరోసారి తప్పదా?

Published on Wed, 07/16/2025 - 14:02

కొన్నాళ్ల ముందు రిలీజైన 'రాజాసాబ్' టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబరు 5న మూవీ రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు కూడా. దీంతో ఫ్యాన్స్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు సినిమా మరోసారి వాయిదా పడనుందనే రూమర్స్ వస్తున్నాయి. అందుకు గల కారణాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లెక్క ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 10న 'రాజాసాబ్'ని థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్ బ్యాలెన్స్, గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ప్రస్తుతం మిగిలిన సీన్స్ అన్ని పూర్తిచేసే పనిలో టీమ్ అంతా ఉంది. త్వరలో సాంగ్స్ చిత్రీకరణ కోసం ఫారిన్ కూడా వెళ్లనున్నారు. అలాంటిది ఇప్పుడు 'రాజాసాబ్' సంక్రాంతికి రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం)

'రాజాసాబ్' ఓటీటీ డీల్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఈ వాయిదా రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థల డిసెంబర్ డీల్స్ అన్నీ పూర్తయ్యాయని, వచ్చే ఏడాది జనవరికి అయితే ఒకటి రెండింటివి ఖాళీగా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే 'రాజాసాబ్' దెబ్బ పడే ప్రమాదముంది. ఎందుకంటే డిసెంబరులో సోలో తేదీని వదులుకుని.. సంక్రాంతికి వస్తే కలెక్షన్స్ తగ్గిపోతాయి. అలా కాదని డిసెంబరులోనే వస్తారా అనేది చూడాలి.

మరోవైపు బాలకృష్ణ 'అఖండ 2'.. సెప్టెంబరు 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఈ తేదీ కూడా మారి డిసెంబరుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ vs బాలయ్య అవుతుందేమో? మరోవైపు డిసెంబర్ 5నే బాలీవుడ్ నుంచి 'ధురంధర్' అనే మూవీ రిలీజ్ కానుంది. దీని వల్ల ప్రభాస్ మూవీకి ఇబ్బంది ఏం ఉండదు. సరే ఇవన‍్నీ పక్కనబెడితే ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ నిజమా కాదా అనేది కొన్నిరోజుల్లో క్లారిటీ వస్తుందేమో?

(ఇదీ చదవండి: ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)