ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన ఫౌజీ హీరోయిన్.. ఎందుకంటే?

Published on Mon, 11/10/2025 - 20:18

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిగ్‌ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్‌ లాంటి భారీ బడ్జెట్‌ మూవీలో చేస్తున్నారు. అంతేకాకుండా హను రాఘవపూడితో జతకట్టారు మన బాహుబలి హీరో. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి ఫౌజీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంంలో హీరోయిన్‌గా ఇమాన్వి కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోనే జరుగుతోంది.

తాజాగా ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్ తమ కోసం ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించారని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మీ ఇంటి భోజనం తిని కడుపుతో పాటు గుండె కూడా ప్రేమతో నిండిపోయిందని క్యాప్షన్‌ రాసుకొచ్చింది. థ్యాంక్‌ యూ ప్రభాస్ గారు అంటూ ఇమాన్వి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ప్రభాస్ చేయించిన వెరైటీ వంటకాలను వీడియోను రూపంలో పోస్ట్ చేసింది. కాగా.. ప్రభాస్ గతంలో కూడా తన సినిమాల షూటింగ్ సమయంలో స్వయంగా తానే భోజనాలు తయారు చేయించారు. తన మూవీ షూటింగ్‌లో పాల్గొన్న అందరికీ కూడా కడుపునిండా భోజనం పెట్టి తన గొప్ప మనసును చాటుకుంటూనే ఉన్నారు.

(ఇది చదవండి: 'ఫౌజీ'లో జూనియర్‌ ప్రభాస్‌గా ప్రముఖ హీరో కుమారుడు ఎంట్రీ)

p

ప్రభాస్ - హను రాఘవపూడి కాంబోలో పీరియాడికల్ డ్రామా 'ఫౌజీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.

 

Videos

నువ్వే పెద్ద కల్తీ.. సుప్రీం తిట్టినా బుద్ధి మారదా!

Watch Live: జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్

ఏపీ ఇక సూడాన్.. 17 నెలల్లో బాబు చేసిన అప్పు

షుగర్ పేషెంట్స్ కు రియల్ గుడ్ న్యూస్

తెలంగాణలో మరో బస్సు ప్రమాదం

ఉగ్రవాదుల అరెస్ట్.. మరుసటి రోజే బాంబు బ్లాస్ట్..

ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ హై అలర్ట్

బాంబు బ్లాస్ట్ పై అమిత్ షా ఫస్ట్ రియాక్షన్

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Photos

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్‌ వద్ద భారీ పేలుడు (చిత్రాలు)

+5

తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)