Breaking News

ఆయన నా ఫ్యామిలీ మెంబర్ లాంటోడు.. అందుకే: ప్రభాస్

Published on Wed, 07/16/2025 - 15:54

హీరోలు-నిర్మాతలకు మంచి బాండింగే ఉంటుంది. కానీ వరసగా మూడు సినిమాలు చేయడం లాంటివి మాత్రం కాస్త అరుదు అని చెప్పొచ్చు. ప్రభాస్‌తో 'సలార్' తీసిన హోంబల్ సంస్థ మాత్రం మరో మూడు చిత్రాలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. గతేడాది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్‪‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ దీని గురించి మాట్లాడాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: 'రాజాసాబ్'పై కొత్త రూమర్స్.. మరోసారి తప్పదా?)

'విజయ్ కిరగందూర్ వల్లే హోంబలే సంస్థ ఈ స్థాయికి చేరుకుంది. తనతో కలిసి పనిచేసే వాళ్లని ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు. అందరితో కలివిడిగా ఉంటారు. 'సలార్'తో మా జర్నీ మొదలైంది. మేమంతా ఓ కుటుంబంలా కలిసిపోయాం. ఆయన నా ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. నాలానే విజయ్ కూడా బయట ఎవరితో కలవడు'

'కేజీఎఫ్ షూటింగ్ టైంలో జరిగిన ఓ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. భారీ సెట్ వేయగా అది అనుకోకుండా కాలిపోయింది. టీమ్ అంతా కంగారుపడుతుంటే ఈయన మాత్రం.. 'కంగారుపడొద్దు. డబ్బు గురించి ఆలోచించొద్దు. అనుకున్నట్లు సినిమాని పూర్తి చేయండి' అని ధైర్యం చెప్పారు. సినిమా మేకింగ్‌కి వచ్చేసరికి నాణ్యత విషయంలో అస్సలు రాజీపడరు. అదే నాకెంతో నచ్చింది. అందుకే వరస సినిమాలు చేస్తున్నాను' అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్‌తో 'నిన్నందలే' అనే సినిమాతో హోంబలే సంస్థ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. కేజీఎఫ్, కాంతార, సలార్.. ఇలా భారీ బ్లాక్‌బస్టర్స్‌తో ప్రస్తుతం దేశంలోనే అగ్రసంస్థగా మారిపోయింది. వచ్చే ఏడాది ప్రభాస్‌తో 'సలార్ 2' చేయనున్నారు. మిగిలిన రెండు ప్రాజెక్టులు ఎవరితో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

(ఇదీ చదవండి: థియేటర్లలోకి రిలీజైన ఒక్కరోజుకే ఓటీటీలోకి హిట్ సినిమా)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)