Breaking News

ప్రభాస్‌ బుజ్జి.. ఎక్కడ తయారు చేశారో తెలుసా?

Published on Thu, 05/23/2024 - 15:55

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తోన్న సైన్స్ ఫిక్షన్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. అత్యంత భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని డిఫరెంట్‌ లుక్‌తో కారు(బుజ్జిని) అభిమానులకు పరిచయం చేశారు. ఇందుకోసం భారీ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. డిఫరెంట్‌ లుక్‌లో ఉన్న బుజ్జిని చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

అయితే ఇప్పుడు అందరిదృష్టిని ఆకర్షిస్తోన్న బుజ్జి గురించి నెట్టింట చర్చ మొదలైంది. అసలు బుజ్జిని ఎవరు తయారు చేశారు? డిఫరెంట్‌ లుక్‌లో ఉన్న బుజ్జిని ఎక్కడ తయారు చేశారు? అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. బుజ్జికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలు బయటకొచ్చాయి. బుజ్జిని తయారు చేసేందుకు ప్రముఖ కంపెనీలైన మహీంద్రా, జాయెమ్‌  ఆటోమోటివ్‌ సంయుక్తంగా రూపొందించారు.

కల్కి సినిమా కోసం రూపొందించిన ఈ కారును తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తయారు చేశారు. బుజ్జి బరువు దాదాపు ఆరు టన్నుల బరువుతో రూపొందించారు. ఈ కారు తయారికీ దాదాపు రూ.7 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ముందు రెండు, వెనుక భాగంలో ఒక టైరు మాత్రమే కలిగి ఉన్న బుజ్జి ఫ్యాన్స్‌కు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన కారును ప్రభాస్ స్వయంగా నడుపుకుంటూ వచ్చి అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అమితాబ్, కమల్‌గారు లాంటి గ్రేటెస్ట్‌ లెజెండ్స్‌తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టమని అన్నారు.  కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 27న విడుదల కానుంది. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు