Breaking News

ప్రభాస్‌ ఫౌజిలో యువరాణి?

Published on Sun, 02/16/2025 - 06:05

ప్రభాస్‌(Prabhas) హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). ‘సీతా రామం’ మూవీ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్  ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ శివార్లలోని ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌(Alia Bhatt) ఓ కీలక పాత్రలో అతిథిగా మెరవనున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆలియా ఓ యువరాణి పాత్ర చేయనున్నారని భోగట్టా. సినిమాలో కీలకంగా ఉండే ఈ పాత్ర కోసం చిత్రయూనిట్‌ ఆమెను సంప్రదించగా, ఆమె కూడా పచ్చజెండా ఊపారని బాలీవుడ్‌ టాక్‌. మరి ‘ఫౌజి’లో ఆలియా భట్‌ అతిథి పాత్రలో నటిస్తారా? లేదా అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (2022) చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా ఆలియా భట్‌ నటించిన సంగతి తెలిసిందే. ఇక జయప్రద, మిధున్  చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఫౌజి’కి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)