Breaking News

రాజాసాబ్ 'బాడీ డబుల్‌' ఎఫెక్ట్‌.. ప్రభాస్‌పై ట్రోలింగ్

Published on Mon, 01/12/2026 - 23:49

‘రాజాసాబ్’ సినిమా విడుదలైన తర్వాత హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఈ విమర్శలకు కారణం సినిమాలో బాడీ డబుల్‌ను అధికంగా వాడారనే భావన ప్రేక్షకుల్లో కలగడమే. ప్రభాస్ సీన్లలో ఎక్కువగా హెడ్ రీప్లేస్‌మెంట్ టెక్నిక్ ఉపయోగించి బాడీ డబుల్‌తో చిత్రీకరించారని ప్రేక్షకులు అంటున్నారు. దీంతో ఆయన స్వయంగా యాక్షన్, డ్యాన్స్ సీన్లలో పాల్గొనలేదనే అభిప్రాయం బలపడుతోంది.

అయితే ఇదే సమయంలో విడుదలైన 'మన శంకర వరప్రసాద్' సినిమాలో 70 ఏళ్ల మెగాస్టార్ ప్రతి సీన్‌లోనూ స్వయంగా పాల్గొన్నారు. డ్యాన్స్‌లు, ఫైట్లు అన్నీ ఆయనే చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అవి మరీ అంత క్లిష్టమైన సీన్లు కాకపోయినా, ఒక్క సీన్ కూడా డూప్‌కు వదలకుండా మెగాస్టార్ స్వయంగా చేశారని ప్రేక్షకులు ఆ రెండు సినిమాలను పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 

70 ఏళ్ల చిరంజీవి ఒక్క సీన్ కూడా డూప్‌కు వదలకుండా చేస్తే మరి 40 ఏళ్లు దాటిన ప్రభాస్ మాత్రం ఎందుకు చేయలేకపోతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఫ్యాన్స్ కూడా బలంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. కారణం ‘రాజాసాబ్’లో టెక్నికల్ లోపాలు లేదా నిర్లక్ష్యం వల్లనో కానీ హెడ్ రీప్లేస్‌మెంట్ షాట్లు స్పష్టంగా కనిపించడం సినిమా చూసిన ప్రేక్షకులకు తెలిసిపోవడమే.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)