Breaking News

రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. ది రాజాసాబ్‌ వాయిదా!

Published on Thu, 08/28/2025 - 15:05

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్‌ ది రాజాసాబ్. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ ఊహించని విధంగా మరోసారి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. మిరాయి ట్రైలర్ లాంఛ్‌కు హాజరైన ఆయన ది రాజాసాబ్‌ కొత్త రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. జనవరి 9న ది రాజాసాబ్‌ విడుదల చేస్తామని వెల్లడించారు. టాలీవుడ్‌లో షూటింగ్స్‌ బంద్ కారణం  వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో ఎక్కడ కంప్రమైజ్ కాకుండా హై క్వాలిటీతో తెరకెక్కిస్తున్నామని అన్నారు. దీంతో రెబల్ స్టార్స్ కొంత నిరాశకు గురవుతున్నారు. కాగా.. ఇప్పటికే పొంగల్ బరిలో చాలా చిత్రాలు ఉన్నాయి. వాటితో ది రాజాసాబ్‌ పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. 

కాగా.. ఈ చిత్రంలో సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)