Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా
Breaking News
హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్‌కు గాయాలు !
Published on Wed, 08/17/2022 - 18:11
Popular Actor Nassar Wounded In Cinema Shooting: టాలీవుడ్ స్టార్ యాక్టర్స్‌లో నటుడు నాజర్ ఒకరు. దక్షిణాదిన అయన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలందరి సినిమాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషిస్తూ ఆడియన్స్‌ను అలరిస్తూ వస్తున్నారు. నాజర్ లేకుండ ఎలాంటి పెద్ద సినిమా లేదు అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. తండ్రిగా, పోలీసు ఆఫీసర్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయే ఆయన ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించారు. అయితే తాజాగా ఆయనకు గాయాలయ్యాయని తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో బుధవారం (ఆగస్టు 17) ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న నాజర్ గాయాలపాలయ్యారని సమాచారం. నాజర్‌కు గాయాలు కాగా వెంటనే చికిత్స కోసం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా యాక్టింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నాజర్ స్వయంగా నిర్ణయించుకున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగిన విషయం తెలిసిందే. ఆనారోగ్య కారణాల దృష్ట్యా నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
చదవండి: నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్
సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి!
50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్
Tags : 1