11 వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా మిత్ర పక్షాలపై ఇరాన్ దాడులు
Breaking News
ఊహించని ఓ మలుపు
Published on Wed, 03/11/2026 - 00:03
పూర్ణ, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) విధార్థ్, సుభాశ్రీ రాయగురు ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా ‘డార్క్ నైట్’. జీఆర్ ఆదిత్య ఈ సినిమాకు కథ రాసి, దర్శకత్వం వహించారు. పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పీ19 స్టూడియోస్ పతాకంపై సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ– ‘‘నాలుగు ప్రధాన పాత్రలు, వారి జీవితాల చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుంది. వారి పాత్రల మధ్య ఉన్న సంక్లిష్ట భావోద్వేగాలు, రహస్యాలు, సంఘర్షణలు కథను ఉత్కంఠభరితంగా మలుస్తాయి. అతీంద్రియ అంశాలతో కూడిన ఊహించని ఓ ట్విస్ట్ ఈ కథను కొత్త మలుపు తిప్పి, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: మిస్కిన్, సహ–నిర్మాతలు: శ్రీనివాస్ మేదరమెట్ల, జె. కొండలరావు.
Tags : 1