Breaking News

పవన్‌ని టార్గెట్ చేస్తూ పూనమ్ సంచలన ట్వీట్!

Published on Wed, 02/25/2026 - 10:29

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్.. అవకాశం దొరికిన ప్రతిసారి పవన్ కల్యాణ్‌ని విమర్శిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా పవన్ గురించి నేరుగా ప్రస్తావించకుండానే ఓ బాంబ్ పేల్చింది. ఈసారి ఏకంగా పవన్ మతం, పిల్లలని క్రైస్తవంలోకి మార్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

(ఇదీ చదవండి: పెళ్లి వేళ.. రష్మిక ముద్దు సీన్‌ వ్యాఖ్యలు వైరల్‌)

'మూడు నెలల వయసున్నప్పుడే విదేశాలకు తీసుకెళ్లి పిల్లలకు బాప్టిజం ఇప్పించి, తన వారసత్వాన్ని ఆర్థోడాక్స్ క్యాథలిక్ కైస్తవంలోకి ఎందుకు మార్చారు? హిందువుగా ఉండటం అంటే కేవలం రాజకీయ డ్రామా కోసమే ఆ దుస్తులు ధరిస్తున్నారా?' అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. నేరుగా ఎటాక్‌కి దిగారుగా అని ఓ నెటిజన్ రీట్వీట్ చేయగా.. ఇది ఎటాక్ కాదని, తనకు వచ్చిన ఓ సందేహం మాత్రమేనని పూనమ్ చెప్పుకొచ్చింది. పేరు చెప్పనప్పటికీ.. పూనమ్ ప్రస్తావించింది పవన్ గురించే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హిందుత్వం, సనాతన ధర్మం చుట్టూ జరుగుతున్న చర్చల నేపథ్యంలోనే.. రాజకీయ లబ్ది కోసం ధర్మాన్ని ఉపయోగించుకుంటున్నారా అనే కోణంలోనే పూనమ్ ఈ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

(ఇదీ చదవండి: నంది అవార్డులని పందులతో పోల్చిన తెలుగు నిర్మాత)

.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)