Breaking News

'జిగేలు రాణి' మళ్లీ వచ్చేస్తుంది.. పోస్టర్‌తో ప్రకటన

Published on Thu, 02/27/2025 - 11:42

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా పూజా హెగ్డేకు ప్రత్యేక స్థానం ఉంది. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్‌లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే. తాజాగా రజనీకాంత్‌ - లోకేష్‌ కనగరాజ్‌ సినిమాలో ఎంట్రీ ఇచ్చేసింది. ఈ మేరకు పోస్టర్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేశారు.

రజనీకాంత్‌(Rajinikanth ) ‘కూలీ’(Coolie Movie) సినిమాలో పూజా హెగ్డే స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనుంది. ‘జైలర్‌’లోని ‘కావాలయ్యా’ పాట తరహాలో ఈ ఐటమ్‌ సాంగ్‌ ఉండబోతుందని ప్రచారం ఉంది. స్పెషల్‌ పాటల్లో నటించడం పూజా హెగ్డేకి కొత్తేమి కాదు.హీరోయిన్ గా నటించిన చిత్రాలకంటే.. స్పెషల్ డ్యాన్స్ తో ఇరగదీసిన చిత్రాలతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.  'రంగస్థలం' చిత్రంలో పూజా హెగ్దే 'జిగేలు రాణి' స్పెషల్ సాంగ్ అప్పట్లో యూత్‌ని ఉర్రూతలూగించింది. ఆ పాటకి పూజా వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఎఫ్‌ 3లోనూ పూజా ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్‌ చేసింది. అది కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ రజనీకాంత్‌తో కలిసి ‘స్పెషల్’ స్టెప్పులేసేందుకు పూజా రెడీ అయిపోయింది. రజనీకాంత్‌తో పాటు నాగార్జున కూడా ఈ పాటలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

తమిళంలో స్టార్‌ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌ నటిస్తుంది. విజయ్‌ హీరోగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్‌’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్‌లో ఆమె కనిపించనుంది.  అలాగే డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్‌ హోనా హై’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారామె. షాహిద్‌ కపూర్‌ హీరోగా రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్‌ కాలేదు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)