Breaking News

బాలీవుడ్‌లో నన్ను గ్లామర్‌ డాల్‌గానే చూస్తున్నారు: పూజా హెగ్డే

Published on Wed, 08/13/2025 - 10:50

తమిళసినిమా: పాన్‌ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న నటి పూజాహెగ్డే. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా హిందీ భాషల్లో నటిస్తున్నా ఈ అమ్మడికి క్రేజ్‌ తెచ్చిపెట్టింది తెలుగు చిత్ర పరిశ్రమనే. అక్కడ వరుస పెట్టి  హిట్‌ చిత్రాల్లో నటించిన పూజాహెగ్డే ఆ తర్వాత వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొన్నారు. దీంతో టాలీవుడ్‌లో మార్కెట్‌ డౌన్‌ అయిపోయింది. అయితే ఈ బ్యూటీని కోలీవుడ్‌ రెండోసారి అక్కున చేర్చుకుంది. 13 ఏళ్ల క్రితం ముఖముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదట్లోనే అపజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత విజయ్‌ సరసన బీస్ట్‌ చిత్రంలో నటించే అవకాశం రావడంతో సంబరపడ్డారు. అయితే ఆ చిత్రం కూడా పూర్తిగా నిరాశనే మిగిల్చింది. 

అయినప్పటికీ కోలీవుడ్‌ ఈమెను వదులుకోలేదు ఇటీవల సూర్యకు జంటగా రెట్రో చిత్రంలో నటించారు. ప్రస్తుతం మరోసారి విజయ్‌కు జంటగా జననాయకన్‌ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి రాఘవ లారెన్స్‌తో కాంచన–4 చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. మధ్యలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన కూలీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. విశేషమేమిటంటే పూజాహెగ్డే ఇప్పటివరకు నటించిన ఏ చిత్రానికి రానటువంటి పాపులారిటీ ఈ ఒక్క పాటకే రావడం. 

కూలీ చిత్రం గురువారం అంతర్జాతీయ స్థాయిలో తెరపైకి రానుంది. పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ప్రత్యేక పాటలో నటించడానికి అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. బాలీవుడ్‌లో తనను గ్లామర్‌డాల్‌గానే చూస్తున్నారన్నారు. బహుశా తెలుగు, తమిళ చిత్రాల్లో తను నటించడం వారు చూసి ఉండరేమో అని అన్నారు. తాను ఈ సమయంలో దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు రెట్రో చిత్రంలో తనను రుక్మిణీ కథాపాత్ర గానే మార్చారన్నారు. తనలోని నటనా ప్రతిభను ఆయన నమ్మారని పూజాహెగ్డే పేర్కొన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)