Breaking News

జననాయకన్ రిలీజ్ ముందు పూజా హెగ్డేకు షాక్!

Published on Tue, 07/21/2026 - 23:39

పూజా హెగ్డే కెరీర్‌పై మళ్లీ అనుకోని మబ్బులు కమ్ముకున్నాయి. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ముద్దుగుమ్మ, తన ఆశలన్నీ జననాయకన్ సినిమాపైనే పెట్టుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందని ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ సూచిస్తున్నాయి.  

అయితే పూజా హెగ్డేకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండవని దర్శకుడు హెచ్. వినోద్ స్పష్టంగా ప్రకటించారు. జర్నలిస్టు పాత్రలో కనిపించే పూజా కోసం తొలుత అనేక సన్నివేశాలు రాసుకున్నప్పటికీ, నిడివి కారణంగా చాలావాటిని షూట్ చేయలేకపోయారు. షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను కూడా కత్తిరించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పూజాకు క్షమాపణలు కూడా చెప్పారు.  

ఇక రీమేక్ అంశంపై కూడా దర్శకుడు స్పందించారు. జననాయకన్ సినిమా, తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి రీమేక్ అని అంగీకరించిన ఆయన, కథలో భారీ మార్పులు చేసి కొత్తగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ సినిమా జూలై 23 నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్‌ ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమాకు హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహించగా.. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె.నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుండగా.. ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)