Breaking News

వాళ్లందరూ కేవలం ఫాలోవర్స్‌ మాత్రమే: పూజా హెగ్డే

Published on Sat, 04/19/2025 - 06:47

సినిమా కళాకారులు సొంత డబ్బా కొట్టుకోవడం మామూలే. అది వారికి చాలా అవసరం కూడా. అయితే శ్రుతిమించితేనే హాస్యాస్పదంగా మారుతుంది. పూజా హెగ్డే(Pooja Hegde) ఇలాంటి సెల్ఫ్‌ గోల్‌ కొట్టుకుంటున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ముఖ్యంగా ఆ మధ్య తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా వెలిగారు. అయితే ఆ తరువాత వరుస ఫ్లాప్‌లు ఎదురవడంతో మార్కెట్‌ పూర్తిగా డౌన్‌ అయిపోయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నారు. ముఖ్యంగా తమిళంలో ముఖముడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే తొలి చిత్రంతోనే అపజయాన్ని మూటకట్టుకున్నారు. అదేవిధంగా పదేళ్ల తరువాత విజయ్‌ సరసన నటించిన బీస్ట్‌ చిత్రం నిరాశ పరిచింది. అలాంటిది మరోసారి ఆయనతో జతకట్టే అవకాశాన్ని అందుకోవడం విశేషం. 

విజయ్‌తో జత కడుతున్న జననాయకన్‌ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. సూర్యకు జంటగా నటించిన రెట్రో చిత్రం మే 1న తెరపైకి రానుంది. లారెన్స్‌కు జంటగా ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇలా తమిళంలో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలెట్టిన పూజాహెగ్డేకు ఈ చిత్రాల విజయాలు చాలా అవసరం. అయితే జననాయకన్‌, రెట్రో చిత్రాలపై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. ఈ పాట తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉన్నారు. 

దీంతో ఒక ఇంటర్వ్యూలో పూజాహెగ్డే పేర్కొంటూ తనకు ఇన్‌స్ట్రాగామ్‌లో 3 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారని సెల్ఫ్‌గోల్‌ కొట్టుకున్నారు. అయితే తన చిత్రాలకు 3 కోట్ల టికెట్లు అమ్ముడు పోతాయన్న నమ్మకం మాత్రం లేదని కూడా చెప్పుకొచ్చింది. కొందరికైతే ఏకంగా 26 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉంటారు.. వారి సినిమాలకు కూడా అంతమంది వెళ్లరని చెప్పింది. వాస్తవంగా పూజాకు కూడా 27 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. కొందరు ప్రముఖులకు 50 లక్షల ఫాలోవర్స్‌ ఉంటారని, వారి చిత్రాలకు థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ పెరుగుతుందని, సామాజిక మాధ్యమాలు నిజమైన ప్రపంచం కాదని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.
 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)