Breaking News

PS-1 Twitter Review: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Published on Fri, 09/30/2022 - 07:23

‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (PS–1’). మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ నిర్మించాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం,  కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం ‘PS–1’ నేడు(సెప్టెంబర్‌ 30) విడుదలైంది.  ఈ చిత్రాన్ని తెలుగులో ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేశారు. 

లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం నాలుగేళ్ల విరామం తర్వాత  చేసిన సినిమా... అందులోను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో పొన్నియన్ సెల్వన్‌ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘పొన్నియన్‌ సెల్వన్‌’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. 

విజువల్స్‌ ఎఫెక్ట్స్ , మ్యూజిక్ చాలా బాగున్నాయని చెబుతున్నారు. ‘అద్భుతమైన విజువల్స్‌ ఉన్న ఇలాంటి సినిమాను మణిరత్నం కేవలం 155 రోజుల్లో రెండు భాగాలను ఎలా తెరకెక్కించారో ఊహించుకోవడం కష్టమే. అతని డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కాబట్టి ఇది సాధ్యమై ఉండొచ్చు. మణిరత్నం కష్టానికి ఫలితం దక్కిందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

ఫస్టాఫ్‌ బాగుందని, సెకండాప్‌ యావరేజ్‌గా ఉందని చెబుతూ 2.5-2.75 రేటింగ్‌ ఇచ్చాడు ఓ నెటిజన్‌. విక్రమ్‌, కార్తి, త్రిషల యాక్టింగ్‌తో పాటు ఏఆర్‌ రెహ్మాన్‌ నేపథ్య సంగీతం బాగుందని చెబుతున్నారు. 

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)