Breaking News

PS2: నాలుగు పదుల వయసులోనూ తగ్గని త్రిష అందం

Published on Tue, 04/25/2023 - 08:13

తమిళ సినిమా: కుందవై అనగానే ఠక్కున గుర్తొచ్చేది నటి త్రిషనే. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకటి యువరాణి కుందవై. మణిరత్నం అద్భుత సృష్టి పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం. దివంగత ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి నవలకు వెండి తెర రూపం ఇది. నటుడు విక్రమ్‌, కార్తీ, జయం రవి, విక్రమ్‌ ప్రభు, ప్రకాష్‌ రాజ్‌, శరత్‌ కుమార్‌, ప్రభు, నటి ఐశ్వర్యారాయ్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ఇలా పలువురు ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించారు. దీన్ని మణిరత్నం మెడ్రాస్‌ టాకీస్‌, లైక్‌ ప్రొడక్షనన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలిభాగం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

కాగా రెండవ భాగం ఈనెల 28వ తేదీన భారీ అంచనాల మధ్య తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో చిత్ర యూనిట్‌ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమిళనాడు, తెలంగాణ, ముంబై అంటూ పలు ప్రాంతాలను కాళ్లకు బలపం కట్టుకొని చుట్టేస్తున్నారు. అయితే ఇందులో కుందవై యువరాణి పాత్రకు దర్శకుడు ఏ ముహూర్తంలో త్రిషను ఎంపిక చేశారో గాని, చిత్ర ప్రచారాల్లో ప్రముఖ పాత్రదారులందరూ పాల్గొంటున్నా నటి త్రిషనే సెంటర్‌ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా మారడం విశేషం.

నాలుగు పదుల వయసులో త్రిష కుందవై పాత్రలో రాజసాన్ని ప్రదర్శిస్తూ ఆ పాత్రలో ఒదిగిపోయారనే చెప్పాలి. చిత్రంలో ప్రతినాయకి చాయలున్న పాత్రలో నటించిన ఐశ్వర్యరాయ్‌పై.. కుందవై యువరాణిగా తన నటనతో త్రిష పైచేయి సాధించారని చెప్పకతప్పదు. దీంతో ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. దీంతో చిత్రం కూడా ఇప్పుడు ఆమె పేరును ఎక్కువగా వాడుకుంటోందనే చెప్పాలి.

తాజాగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా త్రిష పోషించిన కుందవై పాత్రకు ఇతర పేర్లు ఏమిటి? అనే కాంటెస్ట్‌తో చిత్ర యూనిట్‌ ఒక వీడియోను విడుదల చేశారు. దీంతో అభిమానులు రకరకాల పేర్లతో సెల్ఫీ వీడియోలను విడుదల చేస్తూ పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్ర ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళాల్లని నిర్ణయించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)