Breaking News

'బిగ్‌బాస్' షో ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు

Published on Tue, 10/07/2025 - 12:09

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ కన్నడకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు బిగ్ బాస్  షూటింగ్   ఆపేయాలని కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) నోటీసు జారీ చేసింది. బెంగళూరు శివార్లలోని బిడడి హోబ్లిలోని జాలీవుడ్ స్టూడియోస్ & అడ్వెంచర్స్‌లో బిగ్‌బాస్ సెట్ ఉన్న విషయం తెలిసిందే.

కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతున్న ప్రకారం.. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి శుద్ధి చేయని మురుగునీటిని సైట్ వెలుపల విడుదల చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.  దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. బిగ్‌బాస్‌ సెట్‌ దగ్గరలో 250 KLD-సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) ఏర్పాటు చేసినట్లు నిర్మాణ బృందం పేర్కొన్నప్పటికీ, ఆ సదుపాయంలో సరైన అంతర్గత డ్రైనేజీ కనెక్షన్లు లేవని.. STP యూనిట్ల నిర్మాణం సరిగా లేదని అధికారులు గుర్తించారు.

అధికారుల తనిఖీలో చెత్త నిర్వహణ పద్ధతులు కూడా చాలా పేలవంగా ఉన్నాయని తేలింది. ప్లాస్టిక్ కప్పులు, పేపర్ ప్లేట్లు, ఇతర డిస్పోజబుల్స్ వంటి వ్యర్థాలు అన్నీ  బహిరంగంగానే వేశారని చెబుతున్నారు. అదనంగా, 625 kVA, 500 kVA సామర్థ్యం గల రెండు డీజిల్ జనరేటర్ సెట్‌లు  అక్కడ ఏర్పాటు చేశారని  తేలింది. ఇది మరింత పర్యావరణ ఆందోళనలను రేకెత్తిస్తోందని చెప్పారు. దీంతో వెంటనే బిగ్‌బాస్‌ షోను ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డు ఆదేశించింది. విద్యుత్‌ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖను సూచించింది.

బిగ్ బాస్ కన్నడ సెప్టెంబర్‌ 28న ప్రారంభమైంది. కిచ్చా సుదీప్‌ హోస్ట్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడంతో సోషల్‌మీడియాలో ఈ వార్తలు వైరల్‌ అవుతున్నాయి.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)