TRS: కవితక్క కొత్త పాట
Breaking News
పొలిటికల్ థ్రిల్లర్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్
Published on Sat, 04/25/2026 - 07:19
ప్రేమమ్, సర్వం మాయ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు నివిన్ పాలీ.. ఈ ఏడాది కూడా ఆయన నటించిన రెండు చిత్రాలు 'సంభవం అధ్యాయం ఒన్ను', 'ప్రతిఛాయ' మంచి విజయాన్ని అందుకున్నాయి. జియో హాట్‌స్టార్ వేదికగా ఓటీటీలో కూడా అదరగొడుతున్నాయి. అయితే, సడెన్‌గా ప్రతిఛాయ(Prathichaya) చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఏప్రిల్ 24న ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఒక్కరోజు గ్యాప్‌లోనే తెలుగులో స్ట్రీమింగ్‌కు రావడం విశేషం.
ప్రతిఛాయ మూవీ నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన ఒక మలయాళ రాజకీయ థ్రిల్లర్. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, థియేటర్లలో ప్రదర్శితమైనప్పుడు విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఇప్పుడు, నిర్మాతలు శ్రీ గోకులం మూవీస్ మరియు ఆర్డీ ఇల్యూమినేషన్స్ ఎల్‌ఎల్‌పి, ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుందనే ఆశతో డిజిటల్ మాధ్యమం వైపు దృష్టి సారించారు.

కేరళ రాజకీయాల చుట్టూ తిరిగే ఫిక్షన్ స్టోరీగా ఈ మూవీ ఉంటుంది. కేరళ ముఖ్యమంత్రి తనను లైంగిక వేధించాడంటూ ఓ మహిళ ఆరోపిస్తుంది. దీంతో కొన్ని రోజుల తర్వాత మనస్తాపంతో సీఎం వర్గీస్ మరణిస్తాడు. ఇలాంటి సమయంలో ఆయన కుమారుడు జాన్ (నివిన్) రాజకీయాల్లోకి వెళతాడు. ఇష్టం లేకుండా పాలిటిక్స్‌లోకి వెళ్లిన జాన్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది ఈ మూవీ అసలు కథ. తన తండ్రి నిజంగానే ఒక మహిళను వేధించాడా..? అనే మిస్టరీని జాన్ ఎలా ఛేదించాడో తెలుసుకోవాలంటే ప్రతిఛాయ చూడాల్సిందే.
Tags : 1