Breaking News

డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. నవదీప్‌ ఇంటికి నార్కోటిక్ పోలీసులు!

Published on Tue, 09/19/2023 - 09:05

మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉ‍న్న టాలీవుడ్ నటుడు నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహించింది. అయితే పోలీసులు సోదాలు నిర్వహించే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అతన్ని అరెస్ట్‌ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్‌చంద్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో నవదీప్ ఇప్పటికే మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. 

అసలేం జరిగిందంటే... 

మాదాపూర్‌లోని ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఫ్లాట్‌లో గత నెల 31న జరిగిన డ్రగ్‌ పార్టీ తీగ లాగిన టీఎస్‌ నాబ్‌ అధికారులు గురువారం మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్‌ విచారణలోనే నటుడు నవదీప్‌ పేరు వెలుగులోకి వచ్చింది. . నవదీప్‌కు స్నేహితుడు, సన్నిహితుడు అయిన రామ్‌చంద్‌ తన వాంగ్మూలంలో నవదీప్‌ సైతం తనతో కలిసి మాదకద్రవ్యాలు సేవించినట్లు వెల్లడించాడు. చివరిసారిగా గత శనివారం వీరిద్దరు వీటిని తీసుకున్నట్లు బయటపెట్టాడు. దీంతో టీఎస్‌ నాబ్‌ అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

నవదీప్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు
డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ను మంగళవారం వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. గుడిమల్కాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి డ్రగ్స్‌ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్‌ వినియోగదారుడిగా ఉన్నాడని.. అతడిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం లంచ్‌ మోషన్‌ రూపంలో నవదీప్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు