Breaking News

మోసం కేసులో హీరోయిన్‌ నమిత భర్తకు నోటీసులు

Published on Wed, 11/15/2023 - 12:15

సౌత్‌ ఇండియా హాట్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది నమిత. తాజాగా ఆమె భర్త  వీరేంద్ర చౌదరి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. 2017లో తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వ్యాపారవేత్తగ కొనసాగుతున్న వీరేంద్ర  దాదాపు 41 లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్లు తమిళనాడు సేలం సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

(ఇదీ చదవండి: మళ్లీ వార్తల్లో నిలిచిన మా ఎన్నికలు.. మంచు విష్ణుపై ప్రకాశ్‌ రాజ్‌ కామెంట్లు)

2016లో తిరుచ్చిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను కలుసుకుని అన్నాడీఎంకేలో చేరారు నమిత. 2017లో వీరేంద్ర చౌదరిని ఆమె పెళ్లి చేసుకున్నారు. జయలలిత మరణానంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై 2019లో ఆమె బీజేపీలో చేరారు.పార్టీలో చేరిన 8 నెలల్లోనే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. అలా ఈ ఏడాదిలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేశారు.  ఇప్పుడు నమిత రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ తరపున జోరుగా తమిళనాడులో ప్రచారం చేస్తోంది.

అదే సమయంలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ స్థితిలో నమిత భర్త మోసం కేసులో ఇరుక్కున్నాడు. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ ( MSME) ప్రమోషన్ కౌన్సిల్, తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడు ముత్తురామన్, కార్యదర్శి దుష్యంత్ యాదవ్‌లు రూ.41 లక్షలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని సేలంకు చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ కేసులో ముత్తురామన్, దుష్యంత్ యాదవ్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదే MSME లో తమిళనాడుకు అధ్యక్షుడిగా ఉన్న నమిత భర్తను కూడా విచారించాలని పోలీసులు భావించారు. ఈమేరకు విచారణకు హాజరుకావాలని నమిత భర్తకు కూడా సమన్లు ​​జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఆయన కనిపించకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతారనే వార్తలు వస్తున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)