Breaking News

అన్నపూర్ణమ్మకు కౌంటర్.. సింగర్ చిన్మయికి షాక్..!

Published on Thu, 02/29/2024 - 11:41

సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన కామెంట్స్‌పై వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అయితే చిన్మయి వ్యాఖ్యలపై గచ్చిబౌలి పోలీసులకు ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. దీంతో చిన్మయి శ్రీపాదపై కేసు నమోదు చేశారు. 

అసలేం జరిగిందంటే.. 
ప్ర‌స్తుతం బామ్మ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న అన్న‌పూర్ణ‌మ్మ‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆడ‌వాళ్ల‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడిన మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అర్ధ‌రాత్రి స్వ‌తంత్రం అన‌గానే ఆరోజుల్లో ఆడ‌వాళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చేవాళ్లా? ఆడ‌దానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి?  రాత్రి 12 గంట‌ల‌ త‌ర్వాత ఏం ప‌ని? అంటూ మాట్లాడింది. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ఎప్పటికప్పుడు స్పందించే చిన్మయి శ్రీపాద.. అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్‌కు రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది.

అమ్మాయిలుగా పుట్ట‌డం మ‌న క‌ర్మ..
చిన్మయి వీడియో మాట్లాడుతూ..' ఇప్ప‌టికీ చాలా ఊర్ల‌లో బాత్రూమ్సే లేవు. ఇలాంటి సంద‌ర్భాల్లో కూడా ఆడ‌వాళ్లు ఎప్పుడు వ‌స్తారా? వాళ్ల‌పై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్ప‌డుదామా? అని ఎదురుచూస్తున్న‌వాళ్లు ఈ స‌మాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేష‌ధార‌ణ వ‌ల్లే ఈ అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్తున్నారు. భార‌త్‌లో అమ్మాయిలుగా పుట్ట‌డం మ‌న క‌ర్మ' అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

Videos

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్