యువన్‌ శంకర్‌ రాజాపై ఆరోపణలు నిజమే: పోలీసులు

Published on Tue, 08/20/2024 - 12:17

కోలివుడ్‌ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా రూ. 20 లక్షలు ఇంటి అద్దె చెల్లించడంలేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే, ఈ వివాదంలో పోలీసుల విచారణ ప్రారంభించారు. ఈ కేసులో నిజనిజాలను వారు వెళ్లడించారు. ఇదే క్రమంలో ఇంటి యజమానికి యువన్‌ శంకర్‌ రాజా నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం చేకూరేలా ఇంటి యజమాని ఆరోపించాడంటూ లాయర్‌ ద్వారా రూ. 5కోట్లకు పరువునష్టం దావా వేశారు.

కొన్నేళ్లుగా నుంగంబాక్కం సరస్సు ప్రాంతంలో అజ్మత్ బేగం అనే వారికి సంబంధించిన ఇంట్లో యువన్‌ అద్దెకు ఉంటున్నాడు. అద్దె చెల్లించకుండా యువన్‌ ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పటి వరకు రూ. 20 లక్షలు బకాయిలు ఉన్నాయని  అజ్మత్ బేగం సోదరుడు మహ్మద్ జావిద్ తిరువల్లికేణి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఇలా చెబుతున్నారు.  పోలీసుల దర్యాప్తులో  యువన్ శంకర్ రాజా అద్దె బకాయిలున్నట్లు  తేలింది.

అదేవిధంగా యువన్ శంకర్ రాజా ప్రతినెలా అద్దె మొత్తం చెల్లిస్తున్నట్లు తెలిపారు. గత కొద్దిరోజులుగా విజయ్ నటిస్తున్న గోట్‌ సినిమా పనుల్లో యువన్‌ బిజీగా ఉండటం వల్ల ఇంటి యజమానికి అందుబాటులో లేరని తెలుస్తోంది. సినిమా ఆడియో విడుదల అనంతరం ఇంటి అద్దె చెల్లిస్తానని యువన్ శంకర్ రాజా  తెలియజేసినట్లు సమాచారం. అయితే, యువన్ శంకర్ రాజా ఇల్లు ఖాళీ చేసేందుకు ప్రయత్నించగా.. అద్దె చెల్లించకుండా మోసం చేస్తారనే భయంతో ఇంటి యజమాని ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను వివరణ కోరగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఇందులో ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

అనంతరం యువన్ శంకర్ రాజా తరపున లాయర్  ఇంటి యజమానికి నోటీసులు పంపారు. యువన్‌పై నిరంతరం పరువునష్టం కలిగేలా ఇంటి యజమాని ప్రవర్తిస్తున్నారని లాయర్‌ తెలిపారు. దీంతో రూ. 5 కోట్లు  పరిహారం చెల్లించాలని, లేదంటే ఈ సివిల్‌ సమస్యను క్రిమినల్‌ కేసుగా మారుస్తామని నోటీసులో  పేర్కొన్నారు. యువన్‌పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసి తీవ్ర మనోవేదనకు గురిచేశారని, దీంతో  వారిపై తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)