విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
Breaking News
‘ప్లాట్’ సరికొత్త ప్రయోగాత్మక చిత్రం: వేణు ఊడుగుల
Published on Fri, 10/27/2023 - 03:27
వికాస్ ముప్పాల, గాయత్రీ గుప్తా, సాజ్వి పసల, సంతోష్ నందివాడ, కిశోర్ ప్రధాన పాత్రధారులుగా భాను భవతారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్లాట్’. కార్తీక్ సేపురు, తరుణ్ విఘ్నేశ్వర్ సేరుపు, భాను భవ తారక ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అతిథిగా హాజరై, ట్రైలర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చూస్తే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. దర్శక–నిర్మాతలు ఈ తరహా సినిమాలను తీయాలంటే ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించాలి’’ అన్నారు.
‘‘నా కెరీర్‌కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు వికాస్ ముప్పల. ‘‘ఈ సినిమాను చూసి ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు’’ అన్నారు భాను భవతారక, తరుణ్ విఘ్నేశ్వర్.
Tags : 1