Breaking News

2023లో బాగా భయపెట్టిన చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది

Published on Sat, 12/30/2023 - 17:17

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో  శ్రీరామ్‌, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ఈ సినిమాతో సాయికిరణ్‌ దైదా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయి బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్స్‌ రాబట్టింది. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రం 1930, 1990.. వర్తమానం.. ఇలా మూడు కాలక్రమాల్లో జరిగే కథగా అద్భుతంగా డైరెక్టర్‌ చూపించారు. ఇందులో అవసరాల శ్రీనివాస్‌, ఈశ్వరీ రావు, రవివర్మ కీలకపాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే ఈ హారర్ మూవీ పిండం ఇప్పుడు ఓటీటీలోకి  స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్‌లలో ప్రేక్షకులను బాగా భయపెట్టిన పిండం చిత్రాన్ని  వచ్చే ఏడాది అంటే 2024 జనవరి మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్నట్లు సమాచారం. 

2023లో బాగా భయపెట్టిన చిత్రంగా  పిండం గుర్తింపు పొందింది. ఈ సినిమా టైటిల్‌ 'పిండం' అని ఎందుకు పెట్టారో దర్శకుడు గతంలో ఇలా చెప్పారు.  మొదటి సినిమానే ఇలాంటి పేరుతో ఎందుకు తీస్తున్నావని అందరూ ప్రశ్నించారు. అది నెగెటివ్‌ పదమని అంతా అనుకుంటారు. కానీ, పిండం అంటే ఆరంభం.. అంతం రెండూ ఉంటాయి. అందుకే ఆ పేరు పెట్టాను.' అని ఆయన అ‍న్నారు. సినిమా చూశాక ఇదే సరైన టైటిల్ అని అందరికీ అనిపించింది.. హరర్‌ సినిమాలను అమితంగా ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పవచ్చు.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)